Posted by admin on 2024-02-07 15:35:52 | Last Updated by admin on 2025-07-07 23:38:35
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 486
By
Devender Reddy.
Chinthakuntla
9848070809.
హకా ( హైదరాబాద్ అగ్రికల్చరల్ కో ఆపరేటీవ్ అసోసియేషన్ లిమిటెడ్ ) సరిగ్గా ఏడాది క్రితం వరకు ఓ అనామక వ్యవస్థ 160 కోట్లు టర్నోవర్ ఉన్న ప్రభుత్వ ఇండిపెండెంట్ నోడల్ ఏజెన్సీ. ఇసుకలోంచి తైలం పుట్టించొచ్చు అనే బిజినెస్ మెన్ చేతిలో పడింది. దీంతో నెలల్లోనే డబల్ టర్నోవర్ తీసుకోచ్చారు. అయితే వ్యాపారం ఎదైనా శత్రువులు పక్కనే ఉండే మిత్రులతోనే ప్రారంభం అవుతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఓ యువ కాంగ్రెస్ నేత తన లేటర్ హెడ్ పై కేంద్ర స్కీం అయినా భారత్ దాల్ లో 2400 కోట్ల అవతవకలు అంటూ ప్రచారం చేశారు. బిజినెస్ మ్యాన్ కి బీఆర్ఎస్ పార్టీ మార్క్ ఉండటంతో ఆ కాంగ్రెస్ నేత కనిపించిన కాంగ్రెస్, బిజేపీ నేతలకు ఎమోషనల్ కనెక్టివిటీ చెప్పారు. దీంతో 25 ఏండ్లుగా ఖాళీగా ఉన్నా హాకా ఛైర్మన్ ఫోస్టు లో వేల కోట్లు సంపాదించవచ్చా.. అంటూ అనుమానాలు వచ్చాయి. ఎంతో ఇన్వెస్టిగేషన్ చేస్తే గాని అసలు రంగు భయటపడలేదు. మాయమాటలకు ఎవ్వరు ఊసరవెళ్లిగా మారుతున్నారో అర్ధం కాని పరిస్థితి. వ్యాపార వేత్తలు వారి వ్యాపారం కోసం ఎంతకైనా తెగిస్తారని చెప్పడానికి భారత్ దాల్ స్కాం తెర పైకి తెవడమే ఒక ఉదహారణగా మారింది. ఎన్ని అక్రమాలకు పాల్పడ్డా.. 5 శాతానికి మించి చేయలేరు. 4 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా రిలీజ్ కాలేదు. లక్ష 40 వేల టన్నులే రిలీజ్ అయ్యాయి. ఇందులో పప్పుగా 90 వేల మెట్రిక్ టన్నులు పంచేశారు. అంతా కలిసి 420 కోట్ల వ్యాపారం జరిగింది. కాని 2400 కోట్ల స్కాం అంటూ ఒకసారి, 1250 కోట్లు అంటూ మరోసారి కాంగ్రెస్ అధికార ప్రతినిధి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బడి ముబ్బడిగా పిర్యాదులు చేయడంతో కలవరం మొదలయింది. ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ . కామ్ కూడా ఈ కథనంలో పిర్యాదుల మేరకు కథనం ఇచ్చింది. కాని ఇదంతా వ్యాపార కక్షలని తెటతెల్లం అయింది. ఏమోషన్స్ అటాచ్ చేసి పెద్ద స్కాంగా చిత్రకరించి, వ్యక్తిగతంగా ధాన్యం టెండర్స్ లో లబ్దిపొందేందుకు చేసిన ప్రయత్నమే అని ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ డాట్ కామ్ పరిశోధనలో తెలింది. అధికంగా సంపాదించాలనే ఉద్దేశంతో అందరికి ఓ బూతద్దంలో పెట్టి చూపించి కట్టుకథలకు బడా నేతలు కూడా నిజమే అన్నట్లు చేశారని గుర్తించింది. కాని ప్రజల సొమ్ముని కాజేసేందుకు సిండికేట్ రంగం ఎప్పుడు సిద్దంగా ఉందని అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
భారత్ లో ఎదైనా , ఎలాగైనా స్కాంలు చేయవచ్చు.
అవినీతికి అస్కారం లేకుండా కేంద్ర ప్రభుత్వం స్కీంలను ప్రవేశ పెడుతుంది. క్లోజ్ మానటరింగ్ సిస్టమ్స్ ని క్రియేట్ చేస్తుంది. అయినా స్కీంలో స్కాంలు చేయడం ఈజీనే. వ్యాపార రంగంలో ఉన్న వారు ప్రభుత్వ సొమ్మును ఎలా కాజేయాలని చూసేందుకే ప్రయత్నం చేస్తారు. అందుకు అధికారులు అప్రమత్తంగా ఉంటేనే శ్రేయస్సు. కాని అధికారులు కుమ్మక్కు అయితే ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అన్నట్లుగా ఉంటుంది. హకా అనే సంస్థ 1949 లో ఏర్పాడింది. హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ( కర్ణాటక, మహారాష్ట్ర) తెలంగాణ లో భాగం ఉన్నప్పుడే ఈ సంస్థను ఏర్పాటు చేశారు. అప్పడే అగ్రికల్చర్, చిరు ధాన్యాల వ్యాపార వ్యవస్థను పటిష్టం చేశారు. మల్టిస్టేట్ లో ఏర్పాటు అయినందున ఇప్పటికి కేంద్ర సంస్థలు అయినా కేంద్రీయ బండారీ, నాఫెడ్ తో పాటు మరో 2 సంస్థలతో పోటి పడి టెండర్లు దక్కించుకుంటుంది హాకా. ఇందుకు వ్యాపార లావాదేవీలే ముఖ్యంగా ఉండేలా మారిన సిస్టమ్స్ కి అనుకూలంగా మార్చుకునేందుకు ఈ సంస్థలను బిజినెస్ మెన్స్ అర్హత కోసం ఉపయోగించుకుంటున్నారు. ఆ టెండర్స్ లో పాల్గోనేందుకు మినహాయింపులే ఉండటమే ఈ సంస్థకు ఉన్న వరంగా భావిస్తున్నారు. అందుకే ఇప్పుడు ఇంతగా వివాదంలోకి నెట్టి, రాజకీయంగా దుమారం లేపి, వ్యాపారంగా వాడుకోవాలని చూస్తున్నారు. ఎవ్వరు వచ్చినా ఈ వ్యాపారం, సిండికేట్ల టెండర్స్ ఆగవని తెలుస్తుంది. కాని అవకాశం కోసం ఎదైనా పిర్యాదు చేస్తాం అనే తీరు మార్చుకోవాల్సి ఉంది. వ్యవస్థలను బూచీగా చూపించి పబ్బం గడిపే వారికి గుణపాఠం నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Bharath dal Scam | Macha Srinivasa Rao | paddy tenders Telangana | HACA Hyderabad | HACA Chairman | Telangana agriculture | Kendria bandari | Amith Sha | official Spok person Congress |