Posted by admin on 2023-11-13 04:37:34 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 2045
By
Devender Reddy
9848070809
తెలంగాణలో ఎన్నికల వేళ అదాయపు పన్ను శాఖ దాడులు తీవ్రమవుతున్నాయి. బీజేపీ, బీఆర్ఎస్ నేతలను కాకుండా కాంగ్రెస్ నేతలపైనే ఐటీ గురి పెట్టడం పై రాజకీయ రంగు పులుముకుంది. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ లో గెలిచి బీఆర్ఎస్ లోకి వచ్చి మంత్రి అయినా కుటుంబ సభ్యుల పై ఐటీ దాడులు కోనసాగడం పై అనుమానాలు తావిస్తున్నాయి. అందుకు అనేక కారణాలు ఉన్నాయని తెలుస్తుంది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడైన ప్రదీప్ రెడ్డి ల్యాండ్ డీలింగ్స్ యే కారణమంటున్నారు. గత రెండేళ్లుగా లిటిగేషన్ భూముల పై భారీగా సంపాదించారని తెలుస్తుంది. నెల రోజుల క్రితం గుట్టల బేగంపేట్ లోని వందల ఎకరాలకు ఎసరు పెట్టారు. అందుకు అనుకూలంగా పేపర్స్ రెడీ చేసుకున్నారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే 5000 వేల కోట్ల ప్రాజెక్ట్. అందుకు ఎవ్వరికి బెదిరించాలో వారికి వార్నింగ్ లు ఇచ్చారు. పీడీ యాక్ట్ పెడుతామని ఓ డీసీపీ పూర్తిగా ఇన్వాల్ అయ్యారు. దీంతో విజయవాడకు వెళ్లి మళ్లీ అగ్రిమెంట్లు చేయించుకున్నారు.
నార్సింగ్ లోను అత్యంత ఖరీదైనా భూమి పై కన్నుపడింది. ప్రదీప్ తో ములాఖత్ అయినా డీసీపీ వెంటనే ఎస్ఓటీలను పంపించి కిడ్నప్ కు ప్రయత్నించారు. కొంత మంది అధికారులు ఎలక్షన్ డ్యూటీ తో బిజీగా ఉంటుంటే.. ఆ డీసీపీ టీం మాత్రం భూ కబ్జాలను ప్రొత్సహిస్తున్నారని అరోపణలు ఉన్నాయి. పోజిషన్ లేని భూములకు బెదిరించి పొజిషన్ ఇస్తున్నారని విమర్శలు ఉన్నాయి. అందుకు స్పెషల్ ఆపరేషన్ టీంని అనధికారికంగా వాడుకుంటున్నారని తెలుస్తుంది.
కోట్లలో బదిలీలు.
ఎన్నికల కోడ్ ఉండగానే భూములను అగ్రిమెంట్ చేసుకుని డబ్బులు బదిలాయిస్తున్నారు. దీంతో పాటు హావాల రూపంలో నగదును వివిధ ప్రాంతాలకు తరలించడంలో ప్రదీప్ రెడ్డి దిట్ట అని ఐటీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. అయితే ఈ సొమ్ము బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ నేతలకు మైహోం బూజా నుంచే ప్లాన్ చేసుకోవడంతో ఐటీ రంగంలోకి దిగింది. రియల్ఎస్టేట్ సొమ్ము ఎన్నికల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నట్లు ఐటీ అధికారులకు పిర్యాదులు అందుతున్నాయి. అయితే దాడులు మాత్రం కాంగ్రెస్ కి నిధులు సమకూర్చుతున్న వారి పైనే ఉంటున్నాయని విమర్శలు వస్తున్నాయి.