Police illegal activities

Crime News Breaking News

Posted by admin on 2023-12-28 07:49:26 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 2376


Police illegal activities

  • అవినీతి , అక్రమాల అధికారుల పై వేటు.
  • ఫైరవీల లేటర్స్ కి చెక్, గత దందాల పై ఫోకస్.
  • తమదైన స్టైల్లో కొత్త సీపీల కొరడా ?
  • బీఆర్ఎస్ నేతలతో అంటగాగి అక్రమంగా సంపాదించి ఎస్ హెచ్ ఓ ల పై నిఘా ? 
  • డ్రగ్స్ మాటున సిఐ నుంచి కమిషనర్స్ వరకు కోట్లు దొచుకున్నారు.
  • కాల్ లిస్ట్ లో వాళ్ల పేర్లు ఉంటే చాలు ఇరికించి డబ్బులు దండుకున్న వైనం.
  • తాజాగా బదిలీ అవుతామని తెలిసి అందిన కాడికి దొచుకుంటున్న ఎస్ఓటీ సీఐ. 
  • ఎస్ ఓ టీ సిఐ శివప్రసాద్ తీరు పై పిర్యాదులు చేయడానికి సిద్దమయిన బాధితులు.
  • గతంలో ఎన్ని వార్తలు వచ్చిన పట్టించుకోని ఉన్నతాధికారులు.
  • ఎస్ ఓ టీ పేరుతో ధో నెంబర్ దందాలతో అంటకాగుతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్.
  • పోలీస్ శాఖలో ప్రక్షళణ జరిగితేనే పాలనలో పారదర్శకత
  • గతంలో నేతలకు మేత పెట్టితెనే  లేటర్స్ , ఫోస్టింగ్ లు. 
  • ఆ దందాల పై తాజాగా  సస్పెన్షన్లు, ఎంక్వయిరీలు షురూ.

ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ బ్యూరో.

9848070809.

 

ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు.

ఏ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీకి సన్నిహితంగా మెదిలే అధికారులే ప్రజలకు నేరుగా సంబందాలు ఉండే పదవులు ఉంటాయి. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకోచ్చే ఫవర్ ఫుల్ అధికారం పోలీస్ పోస్టింగ్. గత ప్రభుత్వంలో ఎంతో మంది అధికారులు వారి ఇష్టానుసారంగా వ్యవహారించి భూ కబ్జాలను ప్రొత్సహించారనే అపవాదం ఉంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూనే పేదల హాక్కులను కాలరాసిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. గట్టి పరిచయాలు ఉంటే వాళ్లు ఎలాంటి తప్పు చేసినా పట్టించుకోలేదు.బాధితులుగా ఆడవాళ్లు వస్తే..లొంగతీసుకునే ఖాకీలు ఉన్నారంటే ఎలా వ్యవహారించారో అర్ధమవుతుంది.  నేతలకు మేత పెట్టి వచ్చామని ఇష్టానుసారంగా వ్యవహారించారు. దీంతో వారు ఎం చేసినా అడిగేవారు లేకపోయారు. కమిషనర్స్ పనితనంతో ఫోస్టింగ్ లు ఇచ్చింది వేళ్ల పై లెక్కపెట్టవచ్చని అంటున్నారు.

 రెండు రోజుల్లో ఒక ఎస్పీ, ముగ్గురు సీఐలు, మరో ఎస్సై.

 రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే కొడుకును తప్పించారని పంజాగుట్ట సిఐ దుర్గారావుని, బాధితరాలిని లొంగతీసుకున్నందుకు మియాపూర్ ఎస్సై గిరీష్ కుమారు తో పాటు ఐఏఏస్ ఇంటిని కబ్జా చేశారని ఐపీఎస్ నవీన్ కుమార్ ని బుధవారం సస్పెండ్ చేశారు. గురువారం  సైబరాబాద్ లో మరో ఇద్దరు సిఐలను సస్పెండ్ చేశారు సీపీ అవినాష్ మహాంతి. సివిల్ వివాదంలో తలదూర్చి, బ్యాంకు అధికారిని చిత్రహింసలకు గురిచేసిన కేసులో కేబీహెచ్ బీ ఇన్స్పెక్టర్ వెంకట్ పై , మైహోం భూజాలో కేసును తీసుకొని శంషాబాద్ ఆర్జీఐ స్టేషన్ లో కేసు పెట్టించి అక్రమంగా అరెస్టులు చేపించిన కేసులో  ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు పై వేటు పడింది.

 డ్రగ్స్ లో గట్టిగా సంపాదించిన వారి పై వేటు ఎప్పుడో..

 డ్రగ్స్ కేసు అంటేనే సైబరాబాద్ ఎస్ ఓటీ పోలీసులకు పండగల మారింది. ప్లెడరర్స్ నుంచి కస్టమర్స్ కు చేరిందని నెట్ వర్క్ తెలిస్తే.. కన్య్జూమర్స్ కాల్ డేటాను కూడా వదలకుండా విచారణ జరిపి డబ్బులు దండుకున్నారని ఎస్ఓటీ పోలీసుల పై అరోపణలు ఉన్నాయి. అందుకు మాధపూర్ ఎస్ ఓటీ సీఐ శివ ప్రసాద్ ఆరు తేరినట్లు తెలుస్తుంది. ఈ సిఐ పై విచారణ జరిపించాలని బాధితులు వేడుకుంటున్నారు. ఎస్ ఓ టీ పేరుతో వివిధ ప్రాంతాల్లో వసూలు చేసిన చిట్టా సోషల్ మీడియాలో తిరుగుతుంది. నిజానిజాలు ఎంటో విచారణ జరిపాలని డిమాండ్ పెరుగుతుంది.

 సోషల్ మీడియాలో తిరుగుతున్న మెస్సెజ్ ఉన్నది ఉన్నట్లుగా

 అక్రమ వసూళ్లు .. అవినీతి సంపాదనతో

           కోట్ల రూపాయలకు పడగలెత్తిన

  మాదాపూర్ జోన్ ఎస్వోటి ఇన్స్ పెక్టర్

     హుక్కా..గుట్కా..మట్కా..పేకాటలే వరం..

        ఐపిఎల్ వచ్చిందంటే కాసుల వర్షమే.

తులసి వనంలో గంజాయి మొక్కలా మారి ఎస్వోటికి ఉన్న ఘనమైన చరిత్రను మూసీ నది మురికి కూపంలో కలుపుతున్నాడు.. కరుడు గట్టిన నేరస్థులు , అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాల్సిన వ్యవస్థకు అవినీతి మరకలు అంటించాడు.. పారదర్శకంగా పని చేయాల్సిన అధికారి అక్రమ వసూళ్లే లక్ష్యంగా పెట్టుకున్నాడు..మట్కా..గుట్కా..పేకాట..హుక్కా సెంటర్లను సమూలంగా నిర్మూలించాలనే తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా పని చేస్తున్నారు..

 

ఇన్స్ పెక్టర్ శివ ప్రసాద్ వసూళ్ళ చిట్టా వివరాలివి..

హుక్కా సెంటర్ల దగ్గర వసూళ్ళు..

1. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహరాజా చాట్ సమీపంలో గల బ్లూ బాటిల్ హుక్కా సెంటర్ నుండి ప్రతి నెలా రూ. 50 వేల రూపాయలను అట్టి నిర్వాహకుడి నుండి నేరుగా సదరు ఇన్స్ పెక్టర్ శివప్రసాద్ వసూలు చేస్తున్నాడు..

 2. ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే మరో హుక్కా సెంటర్ డేట్ కేఫ్ నుండి కూడా నెలనెలా లక్ష రూపాయలు తీసుకుంటున్నాడు. అట్టి నిర్వాహకులకు గచ్చిబౌలి గౌలిదొడ్డిలో ప్రిసం అనే పబ్బు కూడా ఉంది.

 3. ఇదే పోలిస్ స్టేషన్ పరిధిలోని యశోద ఆసుపత్రి ఎదురుగా ఉన్న హుక్కా పార్లర్ నుండి కూడా ప్రతినెలా లక్ష చొప్పున దండుకుంటున్నాడు.

 4. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో డిఎల్ ఎఫ్ మార్గంలోని క్లౌడ్ 9 పేరుతో కొనసాగే హుక్కా సెంటర్ నుండి కూడా ప్రతినెలా లక్ష రూపాయలు నేరుగా వసూలు చేస్తున్నాడు..

 5. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ల్యాంకోహిల్స్ ఎదురుగా ఉండే మరో హుక్కా సెంటర్ నుండి నెలకు లక్ష చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నాడు.

 పేకాట .. బెట్టింగ్ రాయుళ్ళ నుండి వసుళ్ళు..

 1. లోధా అపార్ట్ మెంట్స్ లో ఉండే శిరీష్ నుండి పేకాట మరియు బెట్టింగ్ నిర్వాహణ కు గాను లక్షల రూపాయలు అందిపుచ్చుకున్నాడు ఈ ప్రబుద్దుడు.

 2.మాదాపూర్ కావూరి హిల్స్ లో పేకాట నిర్వహించే సాయి ప్రసాద్ రెడ్డి నుండి కూడా లక్షల రూపాయలు వసూలు చేసి ఎస్వోటి టీం దాడి చేయకుండా అనధికార లైసెన్స్ ఇచ్చేశాడు. కింది స్థాయి సిబ్బంది కి తెలియకుండా జాగ్రత్త వహించాడు..

 3. కెపిహెబి లో ఉండే క్రికెట్ బుకీ గబ్బర్ వర్మ నుండి ముడుపులు తీసుకోవడమే కాకుండా అతడి నుండి పలువురు భీమవరానికి చెందిన పందెం రాయుళ్ళ నుండి సెటిల్మెంట్లు చేసుకున్నాడు..

 4. మరో పేరు మోసిన అంతర్ రాష్ట్ర క్రికెట్ బుకీ అయిన కడప నర్సిం హా నుండి ప్రతినెలా లక్షల్లో వసూలు చేసి బెట్టింగ్ నిర్వాహణ సజావుగా సాగేటట్టు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు..

 5. సింగపూర్ అప్పన్న.. భీమవరం క్రిష్ణ నుండి కూడా ముడుపులు దండుకున్నాడు..

 6. హఫీజ్ పేట్ కు చెందిన జీత్ శర్మ మరియు పటాన్ చెరు వెలిమల కు చెందిన ప్రవీణ్ అనే క్రికెట్ బుకీల నుండి కూడా ముక్కుపిండి వసూళ్ళకు తెగబడ్డాడు.. లక్షల రూపాయలు వీరి నుండి గత రెండు సంవత్సరాలువా వసూలు చేస్తూ వస్తున్నాడు..

 గుట్కా వ్యాపారుల నుండి

 1. మినీ బేగం బజార్ గా పేరు మోసిన లింగంపల్లి మార్కెట్ లోని ఆనందం, భరత్, సతీష్ , కెకె బజాజ్ తదితర వ్యాపారుల నుండి ప్రతినెలా లక్షల్లో గుట్కా మాముళ్ళు తీసుకుంటున్నాడు..

రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సంపూర్ణ మద్దతు 

రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సదరు ఇన్స్ పెక్టర్ సంపూర్ణ మద్దతు ఉంటుంది.. ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తూ తాను పోలీస్ అని మరచిపోయి పేదల ముద్ద లాక్కుంటున్న అక్రమార్కులకు వంత పాడుతున్నాడు..

పబ్బుల నుండి వసూళ్ళు..

మాదాపూర్ జోన్ లోని పలు పబ్బుల నుండి లంచాలు వసూలు చేస్తున్నాడు.. మాదాపూర్ పరిధిలోని నోవాటెల్ ఆర్టిస్ట్రీ, కొమ్మా క్లబ్ ల నుండే కాకుండా గచ్చిబౌలిలోని లాల్ స్ట్రీట్ , ఏయిర్ లైవ్, గౌలిదొడ్డిలోని ప్రిసం పబ్బు నుండి లక్షల్లో వసులు చేస్తూ ఇస్తావా చస్తావా అనే ధోరణిలో వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు.. క్రికెట్ బుకీల నుండి వచ్చే సొమ్ముతో కుటుంబ సభ్యులతో కలసి ప్రతి సంవత్సరం కశ్మీర్, సింలా మొదలైన ఉత్తర భారత దేశ పర్యటనలు చేస్తున్నారు.. హోటళ్ళు, విమాన చార్జీలు సైతం వారితోనే పెట్టిస్తున్నారు..

 డ్రగ్స్ వినియోగదారుల నుండి

 ఎస్వోటి టీం పలుమార్లు డ్రగ్స్ సరఫరా దారులను పట్టుకున్న సందర్భంలో వారి నుండి డ్రగ్స్ కొనుగోలు చేసే బడా బాబుల నుండి పెద్దమొత్తంలో వసూళ్ళకు పాల్పడ్డాడు. డ్రగ్స్ కేసులో ఇరికిస్తాను.. మీడియాకు పేర్లు బయటకు ఇస్తానని చెప్పి పలువురి దగ్గర ముక్కుపిండి మరీ వసూలు చేశాడు..

 పెట్రోలు బంకుల నుండి

చిప్పులు పెట్టి పెట్రోలు బంకుల్లో మోసాలకు పాల్పడే అక్రమార్కుల నుండి సదరు అధికారి లక్షల రూపాయలు కాజేశాడని కూడా ఆరోపణలున్నాయి..

కింది స్థాయి సిబ్బంది బలి

తనమీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడల్లా కింది స్థాయి సిబ్బందిని కారకులుగా చూపించి బలి చేయడం పరిపాటిగా మారింది. తాను మాదాపూర్ జోన్ ఎస్వోటి ఇన్స్ పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రెండు సంవత్సరాల కాలంలో 10 మంది జవాన్లను ఎస్వోటి నుండి బయటకు నెట్టేసి తన అవినీతి మరకలను కడిగేసుకున్నారు.. తన అవినీతి గురించి పై అధికారులకు తెలిసినా చర్యలు తీసుకునే సాహసం చేయలేదు.. ఎందుకంటే తన అక్రమ సంపాదనలో వారికి కూడా కొంతమొత్తం ముట్టచెప్పడమే..

అవినీతి సొమ్ముతో రాజ్ పుష్పలో ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలిసింది..

ఎస్వోటి పేరుతో అడ్డగోలుగా వసూళ్ళు చేసి పోలీస్ వ్యవస్థ పరువు తీస్తున్న శివ ప్రసాద్ పై సమగ్ర విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని మాదాపూర్ జోన్ లోని ప్రజలందరి విజ్ఞప్తి

 డ్రగ్స్ వాటలను పంచేశేవారట.

డ్రగ్స్ కేసులో భయపెట్టించి డబ్బులు వసూలు చేసేవారని ఆ డబ్బులను ఏ అధికారికి ఎంత ఇవ్వాలో అంత చేర్చేవారట. నేరుగా అప్పటి సైబరాబాద్ సీపీని కలిస్తే ఇన్స్పెక్టర్ చూసుకుంటారని చెప్పడంతో అందరూ సమర్పించుకోవాల్సి వచ్చిందని అరోపణలు ఉన్నాయి. 

Leave a Comment: