Posted by admin on 2024-01-02 05:14:13 | Last Updated by admin on 2025-07-03 13:47:33
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 2303
by
Devender Reddy
9848070809.
ఆగష్టు 18, 2023న రంగారెడ్డి కలెక్టర్ హరీష్ , స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్స్ కి లేటర్ వ్రాస్తారు. లేటర్ నెంబర్ E1/1030/2022 అని .. నిజానికి ఆ చివరి అంకెలు 2023 అని ఉండాలి. కాని 2022 నుంచి ఆర్ధిక లావాదేవీలతో పెండింగ్ లో ఉందని తెలుస్తుంది. ఈ లేటర్ లో ని ముఖ్య ఉద్దేశం ఫినిక్స్ టెక్నోహబ్ కి చెందిన 99043 స్వోయిర్ యార్డ్స్ భూమిని నిషేదిత జాబితా నుంచి తొలగించాలని. గతంలో ఇదే లేటర్ నెంబర్ మీద ఏడాది క్రితం వెళ్లింది. అది సాధ్యం కాదని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెనక్కి పంపింది. దీంతో ప్రిన్సిపల్ సెక్రెటరీ రెవెన్యూ ప్రత్యేకంగా మోమె జారీ చేశారు. 42300 / 2022 తేది: 05-07- 2023. దీంతో కలెక్టర్ మళ్లీ పాత నెంబర్ వేసి కొత్తగా పంపిస్తారు. ఈ ఏడాది కాలం ఏం జరిగింది. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సిలింగ్ భూములను క్లియర్ చేయని బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఫినిక్స్ కంపనీకే ఎందుకు క్లియర్ చేసింది. ఎంతో వివాదస్పదమైన భూములుగా గచ్చిబౌలి భూములు ఉన్నాయి. అసైన్డ్ , దొంగ 38(ఈ) సర్టిఫికేట్స్, సలింగ్ భూములు ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలకు ఫండ్స్ ఇచ్చి ఒక్కొక్క పార్ట్ గా క్లియర్ చేసుకుంటూ.. సంపద పెంచుకుంటున్నాయి. ఇలా 1996 నుంచే మొదలైయిందని గతంలో ఫినిక్స్ భూ ఫిక్సింగ్ అంటూ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టు దేవేందర్ రెడ్డి వరస కథనాలు అధారాలతో సహా ఇవ్వడం జరిగింది. గజం భూమి 3 నుంచి 4 లక్షలు పెట్టిన దొరకని ప్రాంతం కావడంతో దందా లక్షల్లోంచి వేల కోట్లకు చేరుకుంది.
మేలు చేసింది చూస్తే మతిపోవాల్సిందే.
గచ్చిబౌలి రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబర్ 37,40,42,43,44 మరియు 45 లో 73 ఎకరాల 3 గుంటల భూమికి దొంగ 38(E) సర్టిఫికేట్స్ ఇచ్చారని హైకోర్టులో విచారణ జరిగింది. WP 4059/82, WA 1420/1987, ఇలా ఎప్పటి నుంచో కోర్టు వివాదాల్లో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో అంటే 19-09-2022 న అలాగే 21-04-2023న రాజేంద్రనగర్ RDO విచారణ జరిపి సిసిఎల్ఏ కి నివేదిక ఇచ్చింది. 99043 గజాల భూమిని ఫినిక్స్ టెన్నో హబ్ కి ఇవ్వాలని. ఇక దొంగ 38(ఈ) ద్వారా కస్టోప కార్పోరేషన్ తో పాటు ఇతర సంస్థలకు 190 ఎకరాలు ల్యాండ్స్ రిపార్మ్స్ కోర్టులో వేసుకున్నారు. వీటి పై ప్రభుత్వం అప్పట్లో సిలింగ్ భూములు అయినందున 38(ఈ) చెల్లదు అని కోర్టులో ఫైట్ చేసింది. దీంతో ల్యాండ్ రిపార్మ్స్ ట్రిబ్యునల్ ఖానామెట్ బాలయ్య, మణికొండ కొండయ్య, గద్దె లచ్చయ్య, శెట్టి వెంకయ్య,దరుడు పల్లి బాలయ్య,వీళ్ల వారసులకు 38(E) చెల్లుబాటు కాదని సెక్షన్ 13, సిలింగ్ యాక్ట్ ప్రకారం కొట్టివేసింది. ప్రభుత్వానికి భూమి దక్కింది. వీరంతా భూమిని ఇతర కంపనీలకు అమ్మేసుకున్నారు. సబెక్ట్ సుప్రీం కోర్టు వరకు చేరింది. మరో 137 ఎకరాల 17 గుంటల భూమి కూడా సర్ప్లేస్ ల్యాండ్ అని 2003లోని ప్రభుత్వం పోజిషన్ తీసుకుంది. 2013లో ఫినిక్స్ కంపనీ ఈ భూమి రికార్డుల ప్రకారం 38(ఈ) కాదు ఖారీ ఖాత అని లేటర్ పెట్టారు. శిల్పా లే అవుట్ పేరుతో 99043 గజాల ఉందని ప్లాట్ ఓనర్స్ కి న్యాయం చేయాలని అర్జి పెట్టుకున్నారు. 2020 లో మాజీ మంత్రి మేకపాటి గౌతం రెడ్డితో పాటు కొన్ని సిలింగ్ భూములను ఫినిక్స్ కి 42.22 ఎకరాలు ఐకియా పక్కనే క్లియర్ చేశారు. దాని పైన డిటెయిల్డ్ కథనాలు దేవేందర్ రెడ్డి ఇవ్వడంతో కొన్నాళ్లు బోర్డులు తీసివేసి పనులు జరుపుకుంది ఫినిక్స్ కంపనీ ఆ తర్వాత ఎం చేస్తారు లే అని అందరిని మేనేజ్ చేసి టీఎస్ఐఐసీ ద్వారా అక్రమంగా అనుమతులు తెచ్చుకున్నారు. ఇప్పుడు అలాగే ఇప్పించాలని కోరడంతో ఎన్నికలకు 4 నెలల ముందు 3 వేల కోట్ల విలువ చేసే భూమిని నిషేదిత జాబితా నుంచి ఎత్తివేయించుకున్నారు. అడ్వకేట్ జనరల్ ఓపినియన్ తీసుకుని నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఇదంతా రియల్ ఎస్టేట్ దందా చేయించి క్లియర్ చేసింది మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ జె. రాంచందర్ రావు అని బహిరంగ రహాస్యమే. ఆయన 9 ఏండ్లలో 700 కోట్ల ఆస్తులు సంపాదించాడని న్యాయవాదులు బహిరంగంగానే మాట్లాడుకుంటారు.
ప్లాట్స్ పోయి.. ఏకరాలకు వచ్చే..
ఫినిక్స్ కన్ను పడటంతో ప్లాట్ ఓనర్స్ అందరిని వద్ద నుంచి నాన్ రిజిస్ట్రేషన్ కొనుగోలు చేసుకున్నారు.93022 గజాలు కాస్తా..99043 గజాలు అయింది. రోడ్లు, పార్కులు అందులో కలిపేసుకున్నారు. ఎకరాల్లోకి వచ్చేసింది. అడ్వకేట్ జనరల్ ఓపినియన్ నెంబర్ 85 ఆఫ్ 2022 ని లేటర్ నెంబర్ 193/2023 తేది: 19-03-2023 న నివేదిక ఇచ్చారు. అందులో వివిధ కోర్టు తీర్పులను ఫినిక్స్ కి అనుకూలంగా ఉండే మ్యాటర్ ని మాత్రమే పొందుపర్చుతూ నివేదిక ఉంది. దీంతో ప్రిన్సిపల్ సెక్రెటరీ రెవెన్యూ, సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ కలిసి ప్రొహిబిటెడ్ లో ఉన్న వాటిని ఎత్తివేయాలని కోరారు.
నిషేదిత జాబితాలో ఉన్నా.. రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘనులు.
వివాదస్పద ప్లాట్ ఓనర్ అయితే వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకుంది ఫినిక్స్ కంపనీ. 88 డాక్యుమెంట్ల పై నిషేదం ఎత్తివేయాలని పెట్టుకున్నా.. 2003 నుంచి ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ జరుతునే వచ్చాయి. 99,043 వేల గజాలకు క్లియరెన్స్ ఇవ్వడంతో 3 వేల కోట్ల స్కాం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తలుచుకుంటే ఆ భూమిని ప్రభుత్వ భూమిగానే ఫైట్ చేస్తుంది. కాని పార్టీ ఎదైతే ఎంటీ.. కాసులు ఇస్తున్న ఫినిక్స్ కంపనీ అందరిని కోనుగోలు చేస్తుంది. ప్రజల ఆస్తులను కొల్లగొట్టి వేల కోట్ల బిజినెస్ చేస్తుంది. పక్కా అధారాలతో ఫినిక్స్ భూ ఫిక్సింగ్ పై ఇన్వేస్టిగేషన్ కథనాలు ల్యాండ్ అండ్ రికార్డ్స్ .కామ్ లో వస్తునే ఉంటాయి.
Phoenix Land Scams in hyderabad | BRS Govt Helps to Phoenix | Phoenix Techno Hub | Chukkapally suresh | Chukkapally Avinash | Phoenix Gopikrishna | KTR Phoenix | KCR Phoenix | Phoenix India pvt limited |