Leadspece illegal Business in I &PR Telangana

SCAMS Illegal Business

Posted by admin on 2024-02-02 06:28:06 | Last Updated by admin on 2025-07-07 22:03:47

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 1178


Leadspece illegal Business in I &PR Telangana

  •  GHMCని, I&PR ని నిలువు దొపిడి చేసిన లీడ్ స్పెస్.
  • ఇబ్బడిముబ్బడిగా బిల్లులు విడుదల.
  • పేరుకే టెండర్లు, దక్కేదంతా వారికే.
  • ఏది చేసిన లోకకళ్యాణం కోసమే అన్నట్లు బిల్డప్.
  • చెత్త ఊడ్చే మిషన్స్ నుంచి చెట్లు నరికే వాహానాల వరకు స్కాంలే.
  • రూల్స్ కి విరుద్దంగా బస్ షెల్టర్స్ బోర్డుల కొనుగోలు.
  • బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్లు అడిందే ఆట పాడిందే పాట.
  • దొరికిందల్లా దోచుకోవడానికి ఐ అండ్ పీఆర్ లో 9 ఏజెన్సీలు.
  • మెట్రో యాడ్స్ కి డిమాండ్ రావాలని వేల హోర్డింగ్స్ పికించేసిన ముఠా.
  • జీ.వో. 68 తో డ్రామాలు, తిరిగి అదే అమలు చేసేందుకు యత్నం.
  • ఐ అండ్ పీఆర్ లోని యాడ్స్ లో 350 కోట్ల వీరికే.
  • 30 కోట్లు ఇచ్చారని మాజీ మంత్రి దయాకర్ రావుకు ల్యాండ్ క్రూజర్ గిఫ్ట్.
  • ఇప్పటికి ఆ కారు వాడుకునేది మాజీ మంత్రి, ఈఎంఐలు కట్టెది లీడ్ స్పెస్.
  • అవసరానికి మించి సహాయం చేసిన ఐఎఏస్ అరవింద్ కుమార్ కు ఏమిచ్చారో..
  • బీఆర్ఎస్ సర్కార్ తో వచ్చిన ఇష్టానుసార డబ్బుతో
  • కూకట్ పల్లిలోని వివాదస్పద భూములకు అడ్వాన్స్ లు.
  •  I&PR ఔట్ డోర్ మీడియా స్కాం పై మంత్రి పొంగులేటి సిరియస్.
  • కొత్త విధివిధానాలు రూపోందించాలని అదేశం.
  • లీడ్ స్పెస్ పేరుతో జరిగిన గ “లీజ్” పనుల పై కాంగ్రెస్ ఫోకస్.
  • హైదరాబాద్ లో అడ్వటైజింగ్ ని ఆగం చేసిన తీరు పై
  • ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ డాట్ కమ్ స్పెషల్ స్టోరీ.

By

Devender Reddy. Chinthakuntla

9848070809.

 అది 2014 కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ చివరి కేబినెట్ మీటింగ్. హైదరాబాద్ లో అడ్వటైజింగ్ ల పై కొత్త పాలసీ విధానం రేడీగా ఉంది. అప్పటికే కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు కొన్నింటిని అమలు చేస్తుంది. ఆ విధానాలే ఫాలో కావాలని నిర్ణయం తీసుకున్నారు. కాని ఎమైందో ఆ కాబినేట్ లో అప్రూవల్ కాలేదు. కాలం గిర్రున తిరుగుతే 10 ఏండ్లు గడిచిపోయాయి. బీఆర్ఎస్ సర్కార్ ఆ లొసుగులను ఆసరాగా చేసుకోని తెలంగాణ ఔట్ డోర్ మీడియా ప్రతినిధులను కొట్టి ఆంధ్ర కంపనీలకు అక్షరాల 400 కోట్లు ఒక్క I & PR నుంచే దోచుకున్నారు. అందుకు మాకే అర్హత ఉంది కాబట్టి మాకిచ్చారనే ఒక పదం వాడేసుకుంటారు. అవి ఎలా అడ్డగోలుగా తీసుకోచ్చారో మాత్రం చెప్పరు. జీహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్ ఆంధ్రకి వెళ్లినా.. లీడ్ స్పెస్ వారి బిజినెస్ కోసం మళ్లీ హైదరాబాద్ కి తీసుకోచ్చారు. ఆయనే ఇప్పుడు పరిశుభ్రత కు అడిషనల్ కమిషనర్ గా ఉన్నారు. కాని వారి కోడుకుతో పాటు లీడ్ స్పెస్ వారు భాగస్వామిగా ఉండటంతో రోడ్లను కూడా మిషన్స్ తో కాకుండా మనుషులతో ఊడ్చేపిస్తున్నారు ఈ ఘనులు.

 I&PR లో అడిందే ఆట.

 ఎదైనా ఔట్ డోర్ మీడియాకు ప్రభుత్వం అడ్వటైజింగ్ ఇవ్వాలంటే అది ఐఅండ్ పీఆర్ నుంచే వస్తుంది. ఇక్కడ ఎంఫానెల్ ఎజెన్సీలు ఉంటాయి. అయితే ఇందులో ఒకే గ్రూప్ కి చెందిన 9 ఎజెన్సీలు ఉండటం అందులో డైరెక్టర్స్ కూడా వారే ఉండటాన్ని ఎవ్వరు తప్పు పట్టలేదు. అంతా మాకే కావాలని అందరికి వచ్చినట్లు చూపించేందుకే ఈ 9 ఏజెన్సీలను లీడ్ స్పెస్ ఏర్పాటు చేసుకుంది.

1.      1. లీడ్ స్పెస్. ఇది మెట్రో పిల్లర్స్ ని నామినేషన్ పద్దతిలో ఎల్ అండ్ టీ నుంచి లీజ్ కి తీసుకున్నారు. సుమారు 3500 పిల్లర్స్ ఉంటాయి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ సర్కార్ సహాకారంతో ఎన్నికల ముందు వరకు ఒక్క పిల్లర్ ని ఒక్క సైడ్ లీజ్ తీసుకోని మూడు దిక్కుల ఎక్స్ట్రా టా వాడేసుకున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు గాను నెల రోజుల్లో 51 హోర్డింగ్స్ ఇస్తే 34 పెట్టారు. 53 బస్స్ షెల్టర్స్ కి, 502 మెట్రో పిల్లర్స్ కి ఈ ఎజెన్సీ ద్వారా ఇచ్చారు.  

 2.      క్రైసిస్ అనే సంస్థని రూల్స్ విరుద్దంగా లీడ్ స్పెస్ కొనుగోలు చేసింది. బస్ షెల్టర్స్ టెండర్స్ ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే క్రైసిస్ దక్కించుకుంది. అయితే టెండర్ పేపర్స్ లోనే చాలా స్పష్టంగా ఉంటుంది. ఎవరికి అమ్మవద్దు, ట్రాన్సఫర్ చేయవద్దు అని కాని ఆ కంపనీ అలాగే ఉంటుంది. కాని డైరెక్టర్స్ మారిపోతారు, అకౌంట్స్ మారిపోతాయి. రేట్లలో తేడాలువస్తాయి. ఇప్పటి వరకు ఇంకా వారి దందానే ఎప్పుడో అతి తక్కువ ధరకు పాడుకున్న టెండర్స్ నే కొనసాగిస్తున్నారు. 12 హోర్డింగ్స్ కి 10 పెట్టారు. 50 బస్స్ షెల్టర్స్ కి ఇచ్చారు. నిజానికి ఈ సంస్థకే మాత్రమే బస్ షెల్టర్స్ ఉన్నాయి. ఒక్క ఏజెన్సీ నుంచి మరో ఏజెన్సీకి వీళ్లకు వీళ్లే మార్చేసుకుంటారు.

 3.      ఆర్ ఎల్ కన్సస్ట్రక్షన్. :-

 హోర్డింగ్స్ తో పాటు మెట్రో ఫిల్లర్స్ లోని ఫోర్టల్స్ కి ఈ ఏజెన్సీ ద్వారా యాడ్స్ ఇచ్చారు. లీడ్ స్పెస్ ఓనర్స్ అయినా నాగేశ్వర్ రావు, లక్ష్మణ్ ఇందులో కూడా డైరెక్టర్స్ యే.

 వీటితో పాటు కళ్యాణ్ అడ్స్, అజయ్, శ్రీగాయత్రి, పవన్ ఆడ్స్ , షాడ్స్, పేరుతో ఎజెన్సీలు తీసుకోని వాటి నుంచి వీరి లీడ్ స్పెస్ కి యాడ్స్ రూపంలో ఇచ్చేస్తారు.

 30 కోట్ల యాడ్స్ కి 3 కోట్ల కారు.

పంచాయితీ రాజ్ శాఖ నుంచి భారీగా యాడ్స్ తెచ్చుకున్నారు లీడ్ స్పెస్ యజమాన్యం 30 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేశారని తెలుస్తుంది. అందుకు మంత్రి దయాకర్ రావుకు మూడు కోట్లు విలువచేసే ల్యాండ్ క్రూజర్ వారి కంపనీ పేరు మీద తీసుకోని మంత్రి గారి ఇచ్చేస్తారు. ఇప్పటి వరకు ఇంకా ఆయన దగ్గరే తిరుగుతూ ఉంది. ఈఎంఐలు మాత్రం లీడ్ స్పెస్ నుంచే కట్ అవుతూఉంటాయని ఓపెన్ టాక్.

జీవో 68తో లాభపడ్డది మెట్రో పిల్లర్స్ యే.

ఎల్ అండ్ టీ తో పాటు హెచ్ఎంఆర్ఎల్ యాడ్స్ కి గిరాకి పెరగడానికి కారణం జీవో నెంబర్ 68. హోర్డింగ్స్ ద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయనే నేపంతో కేటీఆర్ అండ్ టీం. జీవో నెంబర్ 68 తీసుకోచ్చారు. వేల సంఖ్యలో హోర్డింగ్స్ ని తొలగించారు. ఎంతో మంది ఔట్ డోర్ మీడియా వారు రోడ్డున పడ్డారు. కాని లీడ్ స్పెస్ మాత్రం అప్పటికే ఎల్ అండ్ టీ ని నామినేషన్ పద్దతిలో పిల్లర్స్ , పోర్టల్స్ తీసుకోవడంతో భారీగా అదాయం సమకూరింది.   

 లీడ్ తీసుకుంటే ఇంక్కకరు బతకొద్దు.

 లీడ్ స్పెస్ యజమాన్యం 2012 లో చిన్న చితక హోర్డింగ్ లు వేసుకుంటూ కాలం గడిపారు. రాష్ట్రం విడిపోవడంతో పంట పడింది. ఈ బిజినెస్ లో నాయకులను ఎలా వాడుకోవాలి. ఎలా బినామిలుగా చేర్చుకోవాలి. మంచి పేరున్న , లాభాలున్న కంపనీల్లో ఎలా డైరెక్టర్స్ గా చేరిపోవాలో తెలుసుకున్నారు. 2014 నుంచి రెండు రాష్ట్రాల్లో అడ్వటైజింగ్ కొల్లగొట్టారు. ఎంత పెడుతున్నారో వారికే తెలియదు. పర్మిషన్ వస్తే చాలు ఎలాగైనా వాడేస్తారు. ఒక్క పిల్లరు యాడ్స్ రెండు వైపుల ఉంటే.. నాలుగు వైపుల వేసుకోని రూల్స్ పాటించకుండూ ఎడపెడా బిజినెస్ చేసుకున్నారు. వీరి లాబియింగ్ తో తెలంగాణ ఔట్ డోర్ మీడియా పత్తాకు లేకుండా పోయింది. నాలుగు సంస్థలే నలుబై సంస్థలుగా చెప్పుకునేలా చేసుకుంటూ.. దందా ఇన్నాళ్లు నడిపించారు.

 కొత్త పాలసీ ఎప్పుడు.?

ఇన్ఫార్మెషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ శాఖలో ప్రచారం దందాకు ఫర్మినెంట్ సొల్యూషన్ తీసుకొచ్చేలా ప్లాన్ సిద్దమవుతోంది. ఔట్ డోర్ మీడియాలో ఇష్టానుసార దందాలు జరగకుండా కొత్త పాలసీలను పరిశీలించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ శాఖ అధికారులను అదేశించారు. లీడ్ స్పెస్ లాంటి సంస్థలకు ఎందుకు లాభం చేకూర్చారో వాటి వెనక ఉన్న అదృశ్య శక్తులు ఎవ్వరో వివరాలు ఇవ్వాల్సింది కోరినట్లు తెలుస్తుంది.

 ఐపీఎస్ తో కలిసి జీహెచ్ఎంసీని  ఊడ్చేశారు.

ఐఎఏస్ అరవింద్, ఐపీఎస్ విశ్వజిత్ ఈ ఇద్దరితో లీడ్ స్పెస్ మున్సిపాల్టీలల్లో దందాలు చేసింది. హెచ్ఎండీఏ పరిధిలో రోడ్ల ఊడ్వడం నుంచి మొదలు కొని చెట్లు నరికేసే మిషన్స్ వరకు స్కాంలే జరిపారు. జీహెచ్ఎంసీ లో జీహుజూర్ అధికారుల పై , దొచుకున్న సంస్థల పై అధారాలతో సహా మరో కథనంలో చూద్దాం. 


LeadSpace | I & PR Telangana | Headspace Nageshwar rao | leadspace Laxman | Errabelly Dayakar Rao | Adds Scam in Telangana | lead space |

Leave a Comment: