Posted by admin on 2023-12-06 13:56:54 | Last Updated by admin on 2025-08-18 19:21:09
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 574
By
Devender Reddy
9848070809
మొదటి దఫాలో జరిగింది ఇదే.
అధికారంలో ఉన్న పార్టీ నేతలు ఎవ్వరని చెప్పితే వారినే ఐఏఎస్ లుగా ప్రమోషన్ తెప్పించిన తీరు బీఆర్ఎస్ సర్కార్ లో కనిపించింది. కేటీఆర్ ఎది చెప్పితే అదే రూల్ అన్నట్లుగా ప్రిన్సిపల్ సెక్రెటరీలు, చీఫ్ సెక్రెటరీలు పని చేశారు. ఏడాది క్రితం 5 మంది నాన్ స్టేట్ సివిల్ సర్వీస్ లుగా గాను 25 మంది లిస్టుని యూపీపీఎస్సీలోని డీవోపీటీకి ఇంటర్వ్యూ కోసం పంపించింది ఆనాటి తెలంగాణ బీఆర్ఎస్ సర్కార్. ఎస్సీఎస్ కోసం దరాఖాస్తు చేసుకోవడానికి నెల రోజుల సమయం ఇవ్వాల్సి ఉండగా.. కేవలం 7 రోజులు మాత్రమే సమయం ఇచ్చి అందరికి తెలిసే లోపే అప్లికేషన్స్ క్లోజ్ అయ్యాయని తెలిపారు. ఎవ్వరు అడిగే సాహసం కూడా చేయలేదు. 25 మందిలో ఇంటర్వ్యూ పాస్ అయింది హరీష్ రావు దగ్గర బందువైన కె.హరిత, ఆయన పీఎస్ అశోక్ రెడ్డి, KTR అడిషనల్ పీఎస్ కాత్యాయనీ దేవి, టీఎస్పీఎస్సీ నర్సింహారెడ్డి తో పాటు నవీన్ నికోలస్ మాత్రం సెలక్ట్ అయ్యారు. ఢిల్లీలో మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఈ లాబీయింగ్ తో లిస్ట్ వచ్చిందని అప్పట్లో అధికారులు అరోపించారు. లిస్టులో ఉన్న టీఐసీసీ ఛైర్మన్ నర్సింహారెడ్డి విజిలెన్స్ దర్యాప్తు ఎదుర్కొన్నా ఆయన పేరు కూడా పంపివ్వడం ఐఏఎస్ అవ్వడం వారి పాలనకు నిదర్శనమని చెప్పవచ్చు.
అప్పుడు ఇంటర్వ్యూకి అర్హులైన వారు - ఇప్పుడు ఆంధ్ర అధికారుల కోసం అడ్డదారిలో కేటీఆర్.
నిజానికి అత్యుత్తమ ప్రతిభా సామర్ధ్యాలు కలిగిన డిప్యూటీ కలెక్టర్ హోదా పే స్కేల్ కలిగిన అధికారులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. 8 ఏళ్లు రాష్ట్ర ప్రభుత్వంలో నిరంతర సర్వీస్ చేసి ఉండాలి. ఎంపిక సమయానికి 56 ఏళ్ల కంటే తక్కువ వయసుండాలి. ఇది వరకు సెలక్షన్ లిస్టులో పేరు ఉన్నట్లయితే వారికి అవకాశం ఉండదు. శాఖ పరమైన చర్యలు ఉండకూడదు. విచారణ పెండింగ్ లో ఉండొద్దు. ఇలాంటి వారికే అవకాశం ఇస్తారు. కానీ కుటుంబ పాలనలో అన్ని వారి ఇష్టారాజ్యం అయింది. మళ్లీ లిస్టులో తమకి అనుకూలమైన అధికారులైన KTR పీఎస్ పి. మహేందర్ తో పాటు, చంద్రశేఖర్ రెడ్డి, వి. సైద, కే. పద్మజ రాణి, ఎస్. పంకజ, కే. సీతా లక్ష్మి, జి. ఫనీంద్ర రెడ్డి , వీ శ్రీనివాసులు 10 మంది పేర్లను పంపించారు. ఇందులో జీ, ఫణింద్ర రెడ్డి, సీతామహాలక్ష్మి, కమర్షియల్ టాక్స్ కి చెందిన అధికారులు ఏపీకి చెందిన వారే. మధుకర్ బాబు ఏపికి చెందిన ఆఫీసర్ ఇండ్రస్టీయల్స్ డిపార్మెంట్ లో పని చేస్తున్నారు. ఇంకా కేటీఆర్ కు అత్యంత దగ్గరగా ఉంటూ మున్సిపల్ శాఖలో పని చేసే , సైదా, మహేందర్. పంకజా అతనికి అత్యంత సన్నిహితంగా పని చేస్తున్నారు. ఇందులో ఏపీ కి చెందిన వారికి అర్హత లేకున్నా.. ఫేక్ సర్టిఫికేట్స్ తో అప్లికేషన్ పెట్టి 10 మంది పేర్లను పంపించారు. గతంలో ఇంటర్వ్యూలో చాల మంచిగా ఎదురుకొన్న అధికారుల పేర్లు లేకుండానే లిస్టు పంపించడం వెనక కేటీఆర్ హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ లిస్టు కేటీఆర్ పిఎస్ మహేందర్ ఏపీ ఆఫీసర్ సీతామహాలక్ష్మి ని ఫైనల్ చేయడానికే అని నేరుగా తోటి ఆఫీసర్స్ తో చెప్పుకోవడం చట్టాన్ని ఎలా వాడుకున్నారో అర్ధం అవుతుంది.
అధికారులకు పదవి గాలం వేసి అక్రమాలకు తెరలేపారా.. ?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంతో నిజాయితీగా జరిగే పక్రియను పైరవీల ప్రమోషన్స్ లా మార్చారు. ఆ పదవులను ఎర వేసి వారికి ఇష్టానుసారంగా పనులు చేయించుకున్నారని తెలుస్తుంది. ఒక్కొక్క అధికారి ఎలాంటి అక్రమాలకు తెరలేపారో.. ల్యాండ్స్ అండ్ రికార్డ్స్. కామ్ ప్రత్యేక కథనాల ద్వారా ప్రజల ముందు ఉంచబోతుంది.
20 వ తేదిన జరిగే ఇంటర్వ్యూలు ఆపాల్సిందే.
కుటుంబ పాలనలో అడిగితే అంతే సంగతులు అన్నట్లుగా జరిగిన వ్యవహారంలో నిగ్గుతెల్చాలని 2022 కు అర్హులైన నాన్ క్యాడర్ ఐఏఎస్ లు డిమాండ్ చేస్తున్నారు. 20వ తేదిన ఢిల్లీలో ఉన్న ఇంటర్వ్యూలను టెక్నికల్ గ్రౌండ్స్ పై ఆపివేసి.. 20 రోజుల్లో రేరా డైరెక్టర్ సత్యనారయణ ఫోస్టును 2022గా వచ్చిన తర్వాత 2023 లో 3 పోస్టులకు గాను పంపించాల్సిందిగా కొత్త ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. లేదంటే కేసీఆర్ కి తెలియకుండా కేటీఆర్ చేసినా పదవుల పైరవుల వ్యవహారంతో తెలంగాణ అధికారులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. టెక్నికల్ గ్రౌండ్స్ పై ఫైల్ వాపస్ తెచ్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
KTR SCAM -1 | BRS IAS Postings Promotions | Telangana IAS list | IAS illegal Promotions |