Posted by admin on 2023-12-04 14:07:07 | Last Updated by admin on 2025-07-03 13:51:31
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 510
కాంగ్రెస్ లో అంతే ఇదంతా కామన్.
ఓవర్ డెమోక్రసీతో కష్టాలు.
ఢిల్లీని మెప్పించే నేత లేకపోవడంతో తిప్పలు.
కేటీఆర్ చెప్పినట్లే జరగుతుందని విమర్శిస్తున్న బీఆర్ఎస్ నేతలు.
రేవంత్ సీఏం అంటూ ప్రకటించిన గంటలోనే ఎన్నో మార్పులు.
కొట్లాటతో కాంగ్రెస్ కలకాలం ఉంటుందా..?
డ్రెస్సింగ్ రూంలోని గొడవలు మ్యాచ్ పై ప్రభావం చూపుతాయా..?
కాంగ్రెస్ అంటేనే అందరూ ఖతర్నాక్ లే..
రేవంత్ సిఎం అయితే ఆయన నిర్ణయాల పైనే అంక్షలా..?
షర్మిలను చేర్చుకోకపోవడంతో డీకే శివకుమార్ కూడా వ్యతిరేకమేనా..?
భట్టి వస్తేనే మా మాట వింటారు - సినియర్ నేతలు.
కాంగ్రెస్ కయ్యాల పై స్పెషల్ స్టోరీ.
ల్యాండ్స్అండ్ రికార్డ్స్ బ్యూరో
9848070809.
స్పష్టమైన మేజార్జీ వచ్చినా.. పదవుల పంపకాల్లో తన్నుకునేందుకు అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో... ఏక వాక్య తీర్మానం కాస్తా.. ఢిల్లీ నేతలను బ్లాక్ మెయిల్ చేసేంత దూరం వెళ్లింది. పదవులు ఇస్తే తీసుకోము. మా పవర్ ఎంటో మాకు తెలుసు మాకు ఈ పదవి ఇవ్వాల్సిందేనని అడిగే స్వేఛ్చ కాంగ్రెస్ లో ఉంటుంది. లెక్కలు పక్కగా వేసుకుని పదవులు ఇవ్వాల్సిందేనని తెగేసి చెప్పుతున్నారు. ఇది కాస్త సృతిమించి పదవుల పంపకాలు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే కాంగ్రెస్ ఇంటర్నల్ గొడవలు అన్ని ప్రజలకు చికాకు పుట్టిస్తాయి. పాలనలో నియంత వ్యవహారం ఉండాల్సిందేనని మళ్లి అనిపించేలా ఫ్రీడం ఉండటంతో ప్రాంతీయ పార్టీలు కొత్తగా పుట్టుకొచ్చే అవకాశాలు లేకపోలేదు.
రేవంత్ ని దూరం ఎందుకు పెట్టారంటే.. ?
రాజ్ భవన్ లో ముహుర్తం ఫిక్స్ చేసుకున్న రేవంత్ రెడ్డికి అడ్డంకులు వచ్చిపడ్డాయి. డీకే శివకుమార్ చెప్పిన కొన్ని విషయాలను రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా పెడచెవిన పెట్టారు. షర్మిలా పార్టీని కాంగ్రెస్ లో కలుపుకునేందుకు రేవంత్ రెడ్డి ఇష్టం చూపించలేదు. అప్పటి నుంచి రేవంత్ సిఎం అయితే ఎవ్వరి మాట వినరని మెస్సెజ్ ఢిల్లీ హై కమాండ్ వరకు చేరినట్లు సమాచారం.
బట్టి వస్తే... మా మాట చెల్లుతుంది. - సినియర్ నేతలు.
బట్టి విక్రమార్కా అందరి వాడిలా వ్యవహారిస్తారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో సార్లు ఆ పార్టీ నేతలతో సిక్రెట్ బేటీలు జరిగేవి. సహకరించాల్సిన వద్ద భారీగానే సహాకారించారని విశ్వసనీయ సమాచారం. నల్గొండ సినియర్ నాయకులు చక్రం తిప్పలంటే బట్టి విక్రమార్క సిఎం అయితేనే అంతా బాగుంటుందని ఢిల్లీ నేతలకు చెప్పారు. దళిత ముఖ్యమంత్రి మాట ఇవ్వకున్నా.. ముఖ్యమంత్రిని చేస్తే చరిత్రలో నిలిచిపోతామనే ఆశ భావంలో ఉన్నారు. కానీ రాజకీయాల్లో అధికారం నిలుపుకోవడం అంతా ఈజీ కాదని అనుభవాలు చెప్పుతున్నాయి. అందరిని కలుపుకుని పోతునే కక్షపూరిత రాజకీయాలు చేయకపోతే మనుగడ కష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి. అభివృద్ది కుంటుపడే అవకాశాలు ఉన్నాయి.
Telangana Congress | Revanth Reddy CM | Congress politics | Batti vikramarka CM