Posted by admin on 2023-12-03 02:07:58 | Last Updated by admin on 2025-07-03 13:33:27
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 924
landsandrecords.com
by
Devender Reddy
9848070809.
రిజల్ట్ రీడింగ్ వస్తు ఉంటే పార్టీల్లో పరేషాన్ మొదలవబోతుంది. కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్స్ ని నియమిస్తే.. కేసీఆర్ ఏకంగా పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులనే రంగంలోకి దింపారు. కాంగ్రెస్ కి 60 దాటవు. దాటితే 6 నెలలు అవకాశం ఇద్దామనే దొరణిలో కేసీఆర్ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్క సీటు తగ్గినా వెంటనే బలపదర్శన చేసుకునేందుకు సమయం కోరే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని క్యాంపు రాజకీయలు చేసినా జనవరి 16 వరకు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయాలి. మేజార్జీ సీట్లు వచ్చిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటామని గవర్నర్ కి విజ్ఞప్తి చేస్తారు. 50 శాతం కంటే ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. 5,6 సీట్లు తక్కువ వచ్చినా ఆయా పార్టీల సహాకారంతో హాంగ్ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తారు మేజార్జీ సీట్లు వచ్చిన పార్టీ. తెలంగాణలో మాత్రం ఒక్క సీటు తక్కువ వచ్చినా అధికారం కొల్పోతుంది. ఎంఐఎం, బీజేపీ, ఇండిపెండెంట్స్ గా ఎవ్వరు గెలిచినా వారంతా కేసీఆర్ గుప్పిట్లోనే ఉంటున్నారు. కాంగ్రెస్, బిజేపీ ఎట్టిపరిస్థితుల్లో కలిసే ఉద్దేశం లేదు. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ లోకి వెళ్లినట్లు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటుకు దగ్గరి అవకాశం వచ్చినా మళ్లీ బీఆర్ఎస్ వైపే అడుగులు పడేందుకు సిద్దమవుతున్నారు కొంత మంది ఎమ్మెల్యే అభ్యర్ధులు.
టచ్ లో పెట్టుకున్నారు.
డికే శివకుమార్ బెంగళూర్ కాంగ్రెస్ పాలిటిక్స్ ని ప్లే చేద్దామని అనుకుంటున్నారు. అందుకే ఆయనకు అభ్యర్ధుల మేనేజ్మెంట్ గా నియమించింది. కానీ ఏపీ సిఎం జగన్ రంగంలోకి దిగడంతో కాంగ్రెస్ కి కష్టకాలం మొదలయింది. నల్గొండ, ఖమ్మం కాంగ్రెస్ లీడర్స్ కి జగన్ కి మంచి సంబందాలు ఉండటంతో రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని తెల్చిచెప్పడంతో రసవంతరంగా రాజకీయాలు ఉండబోతున్నట్లు సమాచారం.
గెలిచే వెలమలను లైన్లో పెట్టారు. ఎస్సీ,ఎస్టీ ఎమ్మెల్యేలే టార్గెట్.
కాంగ్రెస్ నుంచి గెలిచే వెలమ అభ్యర్ధులకు బీఆర్ఎస్ పార్టీ ఫండింగ్ చేసిందనే అరోపణలు ఉన్నాయి. ఏ దొండ్లో కడితే మాకెంటీ.. మా దొండ్లో ఈనితే సరిపోద్ది అనుకున్నట్లు డబ్బులు సర్దుబాటు చేసినట్లు ఆయా నియోజకవర్గాల్లో వినికిడి. ఎస్సీ,ఎస్టీ నియోజకవర్గాల్లో ఎక్కువ సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది. ఆ ఎమ్మెల్యేలకు ఆర్ధిక సహాయకాహారాలతో పాటు క్యాబినేట్ ర్యాంకు హోదా పోస్టులు ఇచ్చేలా సమాచారం చేరవేసినట్లు తెలుస్తుంది.
Telangana Congress will win | CM Revanth Reddy | Dk Shivakumar in TS | Jagan entry in TS Politics | Telangana Election Counting updates |