Posted by admin on 2024-08-23 15:51:29 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 562
సోషల్ మీడియాతోనే ఫైటింగ్ చేసేలా కేటీఆర్ ప్లాన్.
నెలకి 2 కోట్లు
ఖర్చు పెట్టేలా ఫిక్స్డ్ అమౌంట్.
30 యూట్యూబ్ ఛానల్స్ కి
పెట్టింది కోటి.
నితిన్ జీతం నెలకు
60 లక్షలు.
దిలీప్ కి నెలకు 30 లక్షల జీతం.
జర్నలిస్టులకు ఇచ్చేది బిక్షమేనా..?
3 యూట్యూబ్ ఛానల్స్
కొంప ముంచాయని
30 యూట్యూబ్స్ ఛానల్స్ ని వాడుకుంటున్న బీఆర్ఎస్ బీ టీం.
ఎలా చేయాలో నితిన్
అర్డర్.
ప్రచురించేది అంతా కొంతం.
వారి తొందరపాటు
నిర్ణయాలతో కాంగ్రెస్ ప్రభుత్వం అలర్ట్.
వారి అతితోనే చేయి దాటకుండా వ్యవహారిస్తున్న ప్రభుత్వం.
కాంగ్రేస్ ప్రభుత్వానికి లేని లెక్క పత్తా వ్యవహారం.
కేటీఆర్ మీడియాలో బీఆర్ఎస్ కే మైలేజ్ అంటూ నవ్వులు.
ప్రజల్లో నవ్వుల పాలవుతున్న బీఆర్ఎస్ పెయిడ్ జర్నలిస్టులు.
అధిక మైలేజ్ తెచ్చే
వారికి ఎమ్మెల్సీ అంటూ ప్రచారం ?
వండి వార్చడంలో ఫెయిల్ అవుతున్న తీరు పై
ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ .కామ్ స్పెషల్ స్టోరీ.
దేవేందర్ రెడ్డి
చింతకుంట్ల.
9848070809
10 ఏండ్లు పాలించిన
ప్రభుత్వ పార్టీ అయినా బీఆర్ఎస్ డబ్బులు ఎక్కడ ఖర్చు చేయాలో తెలియని పరిస్థితి. అందుకే
సోషల్ మీడియాలో అధికార పార్టీ పై దుమ్మేత్తి పొచేందుకు ఫిక్స్డ్ డిపాజిర్ట్ ల రూపంలో నెలకు అక్షరాల 2 కోట్లు అందుతున్నాయి. ఇవి ఎన్నికల వరకు 5 కోట్లకైనా తీసుకెళ్లి సీఎం కావాలని కేటీఆర్ ప్లాన్ వేశారని తెలుస్తుంది. ఇప్పటికి 2 కోట్లు నెల
కాగానే ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిపోతున్నాయి. అందుకే కొంత
మంది జర్నలిస్టులు పార్టీ కార్యకర్తల్లా కాకుండా ఉగ్రవాద అవతారం ఎత్తుతున్నారు. గతంలో కేసీఆర్ కి
వ్యతిరేకంగా పని చేసిన మూడు యూట్యూబ్ ఛానల్స్ నే అదర్శంగా తీసుకుని నడుపుతున్నారు. మూడింటికి బదులు 30 ఛానల్స్
పెట్టి మళ్లీ అధికారం దగ్గించుకోవాలని చూస్తున్నారు. అందుకే ఏ వార్త పబ్లిక్ లోకి
వచ్చినా వెంటనే వ్యతిరేక వార్త వడ్డించి వార్పించేలా ప్లాన్ చేశారు. కొంత మంది అనుకున్నట్లు చేస్తున్నారు. నిజానికి ఇంత తక్కువ సమయంలో ఏ పార్టీ, సోషల్
మీడియా, జర్నలిస్టులు వ్యతిరేకంగా వ్యవహారించరు. కాని పెట్టిపోషిస్తున్నారు
కాబట్టి రాద్దాంతం చేయాలనే ఉద్దేశంతోనే కొంత మంది జర్నలిస్టులను ఉసగొల్పి పనిచేపిస్తున్నారు.
అందుకు నిదర్శనం రైతు రుణమాఫీ కొండారెడ్డిపల్లి వ్యవహారమే. లెక్కల ప్రకారం 50 లక్షల రైతుల్లో 10 లక్షల మంది రైతులకు ఇప్పటికి ఇప్పుడు నష్టపోయేలా ఉన్నారు. అందుకు కుటుంబంలో రెండు ఖాతాలు ఉండటం. వారి ఏది
కోరుకుంటున్నారో తెలియకపోవడం. కుటుంబం మొత్తం 2 లక్షల కంటే ఎక్కువగా లోన్స్
తీసుకోవడం ప్రధాన కారణం. దీంతో చాలా టెక్నికల్ , పేద, మధ్య, ధనిక కుటుంబాల జీవితాలతో ముడిపడి
ఉంది. ఇవ్వన్ని లెక్కలోకి వేసుకోకుండానే రాద్దంతం చేశారు బీఆర్ఎస్ యూట్యూబ్
మీడియా.. రాజకీయ దుమారంలో మంత్రి పొంగిలేటి సింపతితో కూడిన వివరణ కూడా ఇచ్చారు. అది కూడా
చూపించకుండానే కేటీఆర్ సోషల్ మీడియా దూకుడుగా వ్యవహారిస్తుంది.
కౌన్ బనేగా ఎమ్మెల్సీ..
కాలం, కష్టం చాల
గొప్పది. తీన్మార్ నవీన్ ( మల్లన్న) టైంలీ కొట్లాడాడు. రాజకీయ గోల్ తో ఎమ్మెల్సీ గా నాయకుడు అయ్యాడు. ఆయన వాదం వేరు. గోల్
వేరు. బోర్ వెల్స్ నడిపిన వ్యక్తిగా మాజీ మంత్రి మల్లారెడ్డిలా మాటలతో బతికే రకం అనుకుందాం.. కాని జర్నలిస్టులను ఇట్లకూడా వాడుకోవచ్చని కేటీఆర్ సోషల్ మీడియా డబ్బుల ఆశతో
రుచి చూపించింది. దీంతో అదిగో పులి అంటే ఇదిగో తోకా అంటూ.. రెచ్చిపోతున్నారు. వీరి వ్యవహారంతో వాపును చూసి బలుపులా ఉంటున్నారు. గ్రౌండ్ లేవల్ లో ప్రభుత్వానికి సింపతి తప్పా.. ప్రతిపక్షాలకు మైలేజ్ రావడం లేదు. అది పోగా..
సోషల్ మీడియాలో వ్యూస్ చూసి.. ఓటర్లుగా అనుకుని మైమరిచిపోతున్నారు. ఎవ్వరు
ఎక్కువ బట్టలు చింపుకుంటే..వారికి తర్వాత మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అంటూ
ఓ నేత ప్రకటించడంతో.. ఆ 30 యూట్యూబ్స్ ఛానల్స్ ముసుగులో జర్నలిస్టులని మరిచిపోయి. ఒంట్టిపైన
బట్టలు లేకుండానే ప్రదర్శన చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.
ఏది తప్పొ.. ఎది
ఓప్పో.. తెలియన మైకం.
ఎది ఎమైనా గత
ప్రభుత్వానికి 5 ఏండ్ల తర్వాతనే వ్యతిరేకంగా పని చేసిన జర్నలిస్టులు ఉన్నారు. అందులో నేను ఒక్కడిని. కేసీఆర్ చేసిన తప్పులను మాత్రమే
ఎత్తిచూపాం. వారి ధన దహాం ఎలా ఉండేదో తెర వెనుక ఎన్నో స్కాంలను ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్ గా భయటపెట్టాం. దేవేందర్ రెడ్డిలాంటి జర్నలిస్టులు ఎంతో సబ్జెక్ట్ బ్యాక్ ఎండ్ వర్క్ చేసి స్క్రీన్ పైన కనిపించే వారి ఇచ్చే వాళ్లం.. ఇప్పుడు అలాంటి వ్యవస్థ ప్రతిక్షానికి లేదు. రాదు కూడా.. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కొంచెం టైం ఇవ్వాలి కాబట్టి. సిద్దాంతాలకు కట్టుబడి పని చేయాలనే కట్టుబడి ఉన్నందునే.. కాని బీఆర్ఎస్ కనపడిందే నిజం అనుకునేలా నమ్మించి ఆ క్షణం
నమ్మేలా చేస్తున్నారు. నిజం ఎంటో ప్రజలు భాగ అర్ధం చేసుకుంటున్నారు. అందుకే
వ్యూవర్స్ తప్పా.. గ్రౌండ్ లో నిజాలు భయటపడటం లేదు. వ్యూస్ తో నమ్మితే జగన్,
కేటీఆర్ లు ఇప్పటికి సీఎంగా పిలిచేవాళ్లం.
కాంగ్రెస్ కు లేని
కట్టు కహానీలు.
నాయకులే జర్నలిస్టులు, తప్పని చెప్పితే వెంటనే సరిదిద్దుకునే వైనం, ఎవ్వరికైనా న్యాయం చేయాలనే కోరిక బలంగా ఉంటుంది. మోనోపల్లి వద్దు. మనమంతా ఒక్కటే అంటూ పోయేవాళ్లు. చిన్న చిన్న సెటిల్మెంట్ లో అందరం బతికాలే అనే నైజం వారికి ఉంటుంది. ఇలా ఎంతో మంది నిజాయితీగా వ్రుత్తిని నమ్ముకుని బతుకుతున్న వారికి కలిగే అభయ హాస్తం కాంగ్రెస్ ప్రభుత్వం. జర్నలిస్టు వ్రుత్తిని నమ్ముకుని వేల మంది ఉన్నారు. వాళ్లకు సొంతంగా ఓ ఇళ్లు ఉండాలనే తప్పా.. మరో ధ్యాస ఉండదు. కథలు అల్లాలి. పబ్లిక్ ని మనవైపు మళ్లింపు కోవాలనే ఉద్దేశం లేకుండా కాంగ్రెస్ నాయకుల్లానే ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల స్థలాలు ఇస్తే చాలు ఎదురు తిరుగుతాం అని పని చేసే జర్నలిస్టులు ఉన్నారు.
ఇలా ఒక్క జర్నలిస్టులు వ్యవస్థ కాదు.. ప్రతి ఒక్కరికి ఉంది.
ఇస్తామని చెప్పడంతో చాల మంది
జర్నలిస్టులు సొంతింటి కోసం కాంగ్రెస్ కి పనిచేస్తున్నారు.