Posted by admin on 2024-06-19 13:23:28 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 422
తెలంగాణ పోలీస్ శాఖకే మచ్చ తెస్తున్న కామాంధ ఖాకీలు.
నాడు నాగేశ్వర్ రావు- నేడు భవాని సేన్ గౌడ్ డిస్మిస్.
రక్షణ కల్పించాల్సిన అధికారులే కాటేస్తున్నారు.
రెండేళ్ల క్రితం హైదరాబాద్ సిఐ నాగేశ్వర్ రావు డిస్మిస్.
నేడు కాళేశ్వరం ఎస్ ఐ భవాని సేన్ గౌడ్.
రెండు కేసుల్లోను రివాల్వార్ చూపించి అత్యాచారం చేసినవే.
తన డిస్మిస్ రద్దు చేయాలంటూ కోర్టులను ఆశ్రయిస్తున్న నాగేశ్వర్ రావు.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఆనాటి సీపీ సర్వీస్ రిమూవల్ చేశారని విమర్శలు.
టవర్ లోకేషన్స్ తో వెళ్లి అత్యాచారం- మళ్లీ డ్యూటీ కోసం ప్రయత్నాలు.
ఇప్పుడు ఆర్టీకల్ 311 ప్రకారం కఠిన చర్యలు.
కామాందులను ఊపేక్షించేది లేదంటున్న ఉన్నతాధికారులు.
6 నెలల్లో లైగింక అరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది ఆఫీసర్స్ పై వేటు.
By
Devender Reddy Chinthakuntla .
9848070809.
పోలీస్ అధికారుల్లో కామాంధులకు కొదవ ఉండదు. అందుకే ప్రతి ఏటా రక్షించాల్సిన వారే భక్షిస్తున్నారని వార్తలు వింటున్నాం. పిర్యాదు చేయడానికి వెళ్లిన యువతులను లొంగతీసుకోవడం. కన్నేస్తే ఎలాంటి చర్యలకైనా పాల్పడి రేప్ చేయాలనే కోరిక పెంచుకోవడం అన్ని డిపార్మెంట్లతో పొల్చితే ఈ డిపార్మెంట్ లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అందుకు గత 6 నెలలుగా 8 మంది అధికారుల పై తెలంగాణ వ్యాప్తంగా శాఖ పరమైన చర్యలు తీసుకున్నారు. అందులో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 2 అధికారుల పై వేటు పడింది. ఇలా స్టేట్ వైడ్ చాలానే పిర్యాదులు వచ్చినా.. మీడియాకు లీకు కాకుండా ఉన్నవి చాలానే ఉన్నాయి. ఉన్నతాధికారులు మాత్రం వారికి మోమె జారీ చేయడం, సస్పెండ్ చేయడం లాంటివి చేశారు. ఆ చర్యలు చూసైనా బుద్ది తెచ్చుకోవడం లేదు కొంత మంది కామాంధ అధికారులు. నిత్యం బాధితులకు అందుబాటులో ఉండే వారు కావడం వారి వీక్ నెస్ ని క్యాచ్ చేసుకుని లైగింక దాడులకు పాల్పడటం జరుగుతునే ఉంది. చాలా మంది ఆఫీసర్స్ రెండో ఎఫైర్ మొదటి కుటుంబానికి తెలియకుండా నడిపిస్తుంటారు.
నాడు నాగేశ్వర్ రావు.
పిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తి భార్య పై కన్నేసి, చిత్రహింసలకు గురి చేసి కుటుంబాన్ని తన ఫామ్ హౌజ్ లో కూలీలుగా చేసుకుని రేప్ చేసిన వ్యక్తి మాజీ సీఐ నాగేశ్వర్ రావు. టాస్క్ ఫోర్స్, బంజారాహిల్స్, మారేడ్ పల్లి సిఐగా ఉన్నప్పుడు ఆ బాధిత మహిళని రివాల్వార్ చూపించి అత్యాచారం చేశాడు. భర్త టవర్ లోకేషన్ అధారంగా అతను వెళ్లి మరి చిత్రహింసలకు గురి చేశాడు. రెడ్ హాండెడ్ గా పట్టుకుంటే సినిమా పక్కిలో రివల్వార్ ని చెరువులో వేసిన ఘటనలు ఇంకా మరవలేదు. జూలై 2022 లో జరిగిన ఘనటలో అప్పటి సీపీ సీవీ అనంద్ సర్వీస్ నుంచి రిమూవల్ చేశారు. అయితే ఆ కామాంధ సిఐ మళ్లీ డ్యూటీలోకి వచ్చేందుకు ప్రయత్నం మొదలు పెట్టినట్లు సమాచారం. అందుకు కోర్టులను అశ్రయించి, తనకు నోటీసులు ఇవ్వకుండానే చర్యలు తీసుకున్నారు. బాధిత మహిళ కేసు విచారణ తుది దశకకు చేరుకుంది. న్యాయం చేసి జాబ్ ఇప్పించాలని కోరుకుంటున్నట్లు తెలుస్తుంది. దీనికి తోడుగా గత ప్రభుత్వంలో ఉన్న హోం మంత్రితో పాటు పలువురి వద్దకు వెళ్లి వేడుకున్నట్లు తెలుస్తుంది.
- నేడు భవానీ సేన్ గౌడ్.
ఇప్పుడు భవానీ సేన్ గౌడ్ అదే పరిస్థితి, ఎంతో మంది తన సొంత డిపార్మెంట్ లోని 3 కానిస్టేబుల్స్ లైంగిక దాడులకు పాల్పడ్డారని డీఎస్పీ స్థాయి అధికారి విచారణలో తెలింది. దీంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. గతంలో రెబ్బన ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలోను యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో సస్పెషన్ కి గురయ్యాడు. మంచిర్యాల తాండుర్, కోటపల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సమయంలో కూడా ఇలాంటి లైంగిక అరోపణలు ఎన్నో వచ్చాయని తెలుస్తుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి సిరియస్ గా తీసుకుని సర్వీస్ రిమూవల్ చేయాల్సిందిగా ఐజీ రంగనాథ్ కి అదేశాలు జారీ చేశారు. అరెస్ట్ అయిన భవనీ సేన్ ని 14 రోజుల పాటు రిమాండ్ విధించింది భూపాలపల్లి కోర్టు. ఖమ్మం జైల్ కి రిమాండ్ తరలించారు పోలీసులు.
అలర్ట్ లేకపోతే.. అంతే సంగతులు.
పోలీస్ డిపార్మెంట్ పనితీరే ప్రభుత్వానికి ప్రమాణికంగా ఎన్నో సంఘటనలు చూశాం. గత ప్రభుత్వం పోలీసులను ఎంతగానే వాడేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ నుంచి మొదలు కొని ఎన్నో అరాచాకాలకు తెరలేపింది. ఇప్పుడు అదే డిపార్మెంట్ పై ఉన్నతాధికారులు, ప్రభుత్వంలోని మంత్రులు ఊపేక్షిస్తే అంతే సంగతులు, మళ్లీ నాగేశ్వర్ రావు లాంటి అధికారులకు అవకాశం ఇస్తే అలవాటుగా మారిపోతుంది. అలాంటి అధికారుల పై ఉక్కుపాదం మోపాల్సి ఉంటుంది.