Posted by admin on 2024-05-26 08:04:50 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 309
-
నిత్యం శభాష్ అనిపించుకునే శంభీపూర్ రాజు
-
ఫోన్ ట్యాపింగ్ బాధితుడే.
-
స్థానికంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్నారని నిఘా.
-
ఇంట్లో మనిషి అంటూనే అంతా పసిగట్టారా..?
-
ఎమ్మెల్యేల ప్రొద్బాలాలతోనే సొంతపార్టీ నేతలను వదలలేదా..?
-
విశ్వసనీయతకు మారుపేరులా ఉండే శంభీపూర్ నే నమ్మలేదంటే ఏంటీ..?
-
ఇలా ఇంకా ఎవ్వరెవ్వరు లిస్టులో ఉన్నారు.
-
ట్యాపింగ్ కేసు నిమురు గప్పే నిజాలు.
-
మీ Landsandrecords.com లో ఎప్పటికప్పుడు ఎక్స్లూజివ్
కథనాలు.
By
Devender Reddy
9848070809.
తెలంగాణ ఉద్యమంలో వెన్నంటి ఉండి,
కేసీఆర్ కుటుంబంలో సొంతింటి మనిషిలా పేరు తెచ్చుకున్న వారిలో ఒక్కరు ఎమ్మెల్సీ
శంభీపూర్ రాజు. తెలంగాణ అంటే తరిమికొట్టే రోజుల్లో స్థానికంగా టీఆర్ఎస్ జెండాను
ఎత్తుకున్నారు. తెలంగాణ వచ్చేంత వరకు గణేష్ నిమజ్జనం చేయబోనని ఏడాది పాటు దీక్ష
భూనినా తెలంగాణ ఉద్యమ కారుడు. అంచలంచెలుగా పార్టీలో ఎంతో ఎత్తుకు ఎదిగారు. అధికారం
వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబంలో కీలకంగా వ్యవహారించారనే పేరుంది. స్థానికంగా పార్టీ నేతల పై పట్టుసాధించారు.
అయితే లోకల్ ఎమ్మెల్యే తో శంభీపూర్ రాజుకు పొసకడం లేదని వార్తలు వచ్చాయి. దీంతో
శంభీపూర్ రాజు పై నిఘా పెంచింది బీఆర్ఎస్ పార్టీ. ఆర్దికంగా ఎలా ఎదిగాడని ఆరా
తీసింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పని చేస్తున్నారనే ఉద్దేశంతో ఫోన్స్ ట్యాప్
చేయడం మొదలు పెట్టింది అప్పటి ఇంటిలిజెన్స్ విభాగం. ఏ నిమిషం ఎం చేస్తున్నారో అప్డెట్
తెలుసుకున్నారు. వాట్స్ అప్ చాట్ నుంచి ఫేస్ టైం కాల్స్ వరకు ఏంజరిగేదో తెలుసుకునే
వారు. అందుకు కొత్త కొత్త టూల్స్ కొనుగోలు చేశామని నింధుతులు విచారణలో తెలిపారు.
ఫోన్ లో ఏం జరిగినా నివేదిక ఇంటిలిజెన్స్ చీఫ్ కి వెళ్లేది.
ఎమ్మెల్యే ప్రొద్బాలాలు పనిచేశాయా..?
బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఇదంతా
ఎందుకు చేశారో పోలీసుల విచారణలో నిందుతులు పటాపంచలు చేశారు. కుత్బుల్లా పూర్
ఎమ్మెల్యే కూన వివేకనంద గౌడ్ కు వ్యతిరేకంగా శంభీపూర్ రాజు పనులు నిర్వహిస్తున్నారని
ఉద్దేశంతో నిఘా పెట్టామని ఓ అడిషనల్ ఎస్పీ తన కన్ఫెషన్ రిపోర్ట్ లో పోలీసుల ముందు
ఒప్పుకున్నారు. దీంతో పాటు శంబీపూర్ రాజు ఎక్కడికి వెళ్లినా, ఎవ్వరితో మాట్లాడినా,
వివిధ యాప్స్ ద్వారా ఛాటింగ్ చేసినా క్షణాల్లో తెలుసుకునే వారు. పార్టీ
కార్యక్రమాల్లో ప్రొటోకాల్ తప్పినా హై కమాండ్ నుంచి ఫోన్స్ వచ్చి హెచ్చరికలు జారీ
చేసేవారు. అప్పట్లో అర్ధం కాని వీరంతా, ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం భయటకు రావడం,
ఉన్నతాధికారులు స్టేట్మెంట్ ఇవ్వడంతో అసలు విషయాలు బట్టభయలు అవుతున్నాయి. ఇలా
పార్టీకి ఎంతో నమ్మకంగా పనిచేసినా, కొంత మంది లీడర్స్ ఒత్తిళ్లతో సొంత ఇంటి
మనుషులను టార్గెట్ చేశారు. ప్రతిపక్ష నేతల ఫోన్స్ లో అయితే అన్ని తొంగిచూశారు.
అధికారులు ఆ పార్టీకి మాత్రమే గూఢచారి వ్యవస్థల పనిచేశారు. అందుకే ఇప్పుడు ఊచలు
లెక్కపెడుతున్నారు.
ఎప్పటికప్పుడు ఎక్ల్స్లూజివ్
కథనాలు మీ ముందుకు
ఫోన్
ట్యాపింగ్ వ్యవహారంలో ల్యాండ్ అండ్ రికార్డ్స్ .కామ్ వెబ్ న్యూస్ ఎండీ దేవేందర్
రెడ్డి మొదటి నుంచి ఎక్స్లూజివ్ కథనాలు అందిస్తున్నారు. ఐ న్యూస్ శ్రావణ్, ఏసీపీ ప్రణీత్
రావు వాట్సప్ చాట్ వారి టెర్గెటర్స్ ఫోన్ నెంబర్స్, వారిద్దరి మధ్య జరిగిన
సంభాషణలు ఎప్పటికప్పుడు వివిధ న్యూస్ ఫ్లాట్ ఫారంలో ఎక్కువ రీచ్ అయ్యేలా మీ
ముందుకు తీసుకొచ్చారు. మరిన్ని బ్లాస్టింగ్, వరస ఎక్స్లూజివ్ కథనాలు
ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ దేవేందర్ రెడ్డి మీ ముందు ఉంచనున్నారు.