Posted by admin on 2024-05-16 15:37:09 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 1181
రాష్ట్రంలో రిపోర్టర్స్ అంటేనే ఈ యూట్యూబర్స్ ఫేమస్.
24 గంటల న్యూస్ ఛానల్ లో రోజంతా కనిపించిన రిపోర్టర్స్ కి గుర్తింపు లేదు.
వీరిద్దరి పేర్లు 70 శాతం ప్రజలకు తెలుసు.
జర్నలిజం ముసుగులో రాజకీయాలు నేర్చుకున్న చింతపండు.
తానను తాను ఊహించుకోని బతికేస్తున్న గంజి.
నాలుగు పడవల ప్రయాణంతో పలచన అయినా తీన్మార్.
గంజిని గలీజ్ వాడని చిత్రికరించేందుకు కుట్రలు.
సోషల్ మీడియా న్యూస్ ప్రజెంటర్స్ కి కర్మ సిద్దాంతం వర్తిస్తుందా..?
కావాలనే వీరిద్దరిని ఒకేతాటి పై కట్టి కాటేసేందుకు రేడీ అవుతున్నారా..?
చింతపండు లాంటోడు కాదు ఈ గంజి.
తెలంగాణలో యూట్యూబ్ రిపోర్టర్స్, ప్రజెంటర్స్ ఎవ్వరంటే మొదటగా తీన్మార్ ఆ తర్వాత మన తొలివెలుగు రఘు. తీన్మార్ , ఫోర్త్ ఎస్టేట్ అంటూ లేనిపోని ముచ్చట్లు చెప్పి బతక నేర్చినోడని అందరికి అర్ధమవుతుంది. కేసీఆర్ పదవి పోతే తీన్మార్ ఏమవుతాడో అని మొదటి నుంచి అందరికి ఓ అనుమానం ఉండేది. ఎంత మంచిగా పేరు తెచ్చుకున్నాడో, అంతా తొందరగా చాలా మంది వద్ద చెడ్డవాడు అయిపోయాడు. బ్లాక్ మెయిల్ కి బ్రాండ్ అంబాసిడర్ అంటూ బీఆర్ఎస్ నేతలు చెప్పుతున్నారు. కలిసి వస్తే కాంగ్రెస్ తో , కాదంటే కాటితోనైనా సహా జీవనం చేసేలా పొలిటికల్ కేరీర్ ని అతి తక్కువ సమయంలో ఒంటపట్టించుకున్నాడు తీన్మార్ నవీన్. ఎలాంటి అవకాశానైనా తన మాటలతో అనుకూలంగా మల్లించుకోవాలనుకనే నేర్పరీ. సరే ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఇవ్వన్ని చేయకపోతే తేడా అనుకోవాలి. కాని ఇంకా అదే జర్నలిజం ముసుగులో మాటలను అమ్ముకుని బతికేయడమే జీర్ణించుకోలేకపోతున్నారు కొంత మంది జర్నలిస్టులు. ఇక తానే నెంబర్ టూ అనుకునే రఘు ని ఫర్సనల్ జీవితంలో తొంగి చూస్తు గలీజు అనే ప్రచారం మొదలు పెట్టారు పొలిటికల్ మాఫియా.
పోలీసులకు పిర్యాదు లేదు - జరిగింది ఎప్పుడో తెలియదు.
ఆంధ్రజ్యోతిలో చిన్నపాటి ఉద్యోగంతో మొదలు పెట్టి, మోజో వరకు తానేవ్వరో ఎవ్వరికి తెలియని న్యూస్ ప్రజెంటర్ రఘు. స్పష్టమైన వాయిస్ తో సొంతంగా ఎదుగాలనుకునే వాడిగా గుర్తింపు ఉంది. యూ ట్యూబ్ ని నడపడం ఇంత కష్టమా అనుకుంటూ కాలం ఈదుకుంటూ వస్తున్నాడు. ఫర్సనల్ గా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటికి ఎక్కడ ప్రొపెషన్ ని వాడుకోలేదని దగ్గర చూసిన వారికి తెలుసు. ఎవ్వరికైనా అన్యాయం చేశారని ఫిర్యాదులు రాలేదు. కాని తలా తొక లేని ఓ తోక వీడియోని పెట్టి గంజి రఘు గలీజ్ అంటూ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు ఇంకా చాలా వస్తాయని అనుమానాలు ఉన్నాయి. హాని ట్రాప్ తో ఆగమయ్యాడా..? లేక తనకు తెలియకుండానే ఓ మాఫియాలో చిక్కుకున్నాడా.. అనేది తెలాల్సి ఉంది. కాని తీన్మార్ నవీన్ పలచన అయినట్లు రఘును కూడా అదే దారిలో పట్టుకెళ్లేందుకు ఎమైనా కుట్రలు జరుగుతున్నాయో ఎమ్మెల్సీ ఎన్నికలు అయ్యేసరికి అన్ని బట్టభయలు కానున్నాయి. ఎదైనా న్యాయం, నిజాయితీ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏ వాదంతో రఘు వెళ్లినా అడ్డగోలు వ్యవహారాలు మాత్రం ఎక్కడ కనిపించలేదని తెలుస్తుంది.