Posted by admin on 2024-01-25 08:02:24 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 1215
By
Devender
Reddy. Chinthakuntla
9848070809
తెలంగాణ
రియల్ ఎస్టేట్ సంపద దుబాయి కి తరలి వెళ్లుతుంది. అక్కడే అన్నిఅగ్రిమెంట్స్
అవుతున్నాయి. అక్కడ నుంచి పెట్టుబడుల రూపంలో ఇక్కడి వివాదస్పద భూముల కొనుగోలు
జరుగుతున్నాయి. ఇదంతా గత ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో జరుగుతుండటంతో అనేక
అనుమానాలు తావిస్తున్నాయి. ఫినిక్స్ కి 14 ప్రాజెక్ట్స్ లో వివిధ దశల్లో రెవెన్యూ,
టీఎస్ఐఐసీ, మున్సిపాల్ శాఖ, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ శాఖలతో పాటు రేరా
అధికారులు సహాయసహాకారాలు అందిచారు. వీటన్నింటికి అనుమతులు ఉండటంతో ఇప్పుడు అమ్మేసుకోవాలని
చూస్తున్నారు. అందుకు దుబాయి నుంచి ఇతర దేశాల కంపనీలను ప్రొత్సహిస్తున్నారు.
శివార్లలో వందల ఎకరాలు.
ఫినిక్స్, సాహితీ సొమ్ము లో కొంత భాగం శ్రీనిధికి
చేరింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన సదాశివ్ పేట్, తుక్కుగూఢ, చేవెళ్ల లో ఒకొక్క
చోట 300 ఎకరాలకు తక్కువ కాకుండా కొనుగోలు చేసి పెట్టుకున్నారు. ఇదంతా ఫినిక్స్ లో
అక్రమంగా అనుమతులు పొందిన సొత్తుతోనే వ్యవహారం జరిగినట్లు తెలుస్తుంది. వీటిని లే-అవుట్
చేసి అమ్మేందుకు మార్కెట్ లో పెట్టారు. కాని అమ్ముడు పోకపోవడంతో విదేశీ కంపనీలకు అగ్రిమెంట్లు
చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఫినిక్స్ ఫిక్స్ చేస్తే.. నడిఒడ్డిన వందల ఎకరాలు ఖతం .
రాజకీయ
నాయకులకు అత్యంత సన్నిహితంగా మెలిగే ఫినిక్స్ కంపనీ ఓనర్స్. ల్యాండ్స్ ని క్లియర్
చేసుకోవడంలో దిట్ట. వందల కోట్లు కొట్టి, వేల కోట్లు వెనకెసుకునే ఈ కంపనీ వ్యవహారం
పై గతంలో ఎన్నో కథనాలు చీఫ్ ఎడిటర్ దేవేందర్ రెడ్డి ఇచ్చారు. అత్యంత వివాదస్పద
మైన శంషీగూఢ సర్వే నెంబర్ 57 లోని 100
ఎకరాల భూమిని 1 ఎకరం నుంచి 5 ఎకరాల వరకు పార్ట్స్ గా చేసి అమ్మేసింది. 70 కోట్ల
ఎకరం భూమిని 30 కోట్లు అనేసరికి ఎగబడి కొనుగోలు చేశారు బడాబాబులు. ఈ భూమి పై
బ్యాంకులో లోన్స్ డిఫాల్ట్ అయి ఉంది. రైతులు మా భూమి అంటున్నారు. సుప్రీం కోర్టు
నుంచి తీర్పు వచ్చినా మళ్లీ కోర్టు మెట్లు ఎక్కింది. కొనుగోలు చేసిన వారంతా ఎవ్వరికి
చెప్పుకోలేక సందిగ్దంలో ఉన్నారు. ఐడీఎల్ చెరవు వద్ద మరో 150 ఎకరాలను ఇట్లే
అమ్మేసింది. గల్ప్ అయిల్ కార్పోరేషన్ భూములను కారు చౌవకగా కొట్టేసి, చేతులు
మార్చింది. ఇందులో బడా రియల్టర్స్ ఇప్పుడు డెవలప్మెంట్ చేసుకుంటూ.. అపార్మెంట్లు
లేపేస్తున్నారు. ఇందులో ఐపీఎస్, ఐఎఎస్, హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులు పెద్ద
ఎత్తున పెట్టుబుడులు పెట్టారు. హెచ్ఎండీఏ డైరెక్టర్ బాలకృష్ణ పై ఏసిబీ దాడుల్లో ఫినిక్స్
లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలింది. ఇలా పాతిక మంది అధికారులు ఫినిక్స్ తో
ఆర్ధిక సంబందాలు ఉన్నాయి. సోమేష్ కుమార్, అరవింద్ కుమార్ తో పాటు పలువురు బీహార్
కి చెందిన ఐపీఎస్ లు కూడా కొనుగోలు చేశారని విశ్వసనీయ సమాచారం. అయితే ఇదంతా
ఇప్పుడు దుబాయి కి పెట్టుబడుల రూపంలో వెళ్లుతున్నాయి.
చేతులు దులుపుకుంటున్నారు.
గత ఐదేళ్లలో ఎన్నో భూ స్కాంలకు పాల్పడ్డ బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు దుబాయి లాంటి ప్రాంతాలకు వెళ్లి చేతులు దులుపుకుంటున్నారు. మా వద్ద భూములు ఉన్నాయి. మీరు పెట్టుబడులు పెట్టండి అంటూ ప్రభుత్వంతో క్లియరెన్స్ తీసుకున్న భూములను అప్పగిస్తున్నారు. రేరా లాంటి అనుమతులు ఉండటంతో ఆ కంపనీలు కూడా భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. గూగీ అనే రియల్ ఎస్టేట్ సంస్థ ఓనర్ అక్బర్ కాంగ్రెస్ లో ఉన్నా.. కంపనీ ఏర్పాడిన రెండెళ్లలోనే వందల కోట్లు సంపాదించారు. ఇదంతా బీఆర్ఎస్ అండదండలతోనే అనే అరోపణలు ఉన్నాయి. ఇప్పుడు దుబాయిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారు. ఇక్కడ అక్రమంగా కేటాయించిన భూములను రక్షించుకోకపోతే రాబోయే భావితరాలకు ఇక ప్రభుత్వ అస్తులు విగలవని తెలుస్తుంది.