All Settlers BRS Side

Telangna War 2023

Posted by admin on 2023-12-03 06:15:48 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 331


All Settlers BRS Side

మిని ఇండియాలో బీఆర్ఎస్ సైడే సెటిలర్స్.

10 ఏండ్ల శాంతిభద్రతలే కారణం. 

ఒక్కప్పుడు టీఆర్ఎస్ ని తిట్టిపోసింది వీళ్లే. 

అధికారం వస్తేనే కదా నమ్మకం కుదిరేది. 

తెలంగాణ అంతా ఒక వైపు గ్రేటర్ ఓటర్ల తీర్పు మరో వైపు.

అప్పుడు బలిదానాలను, ఇప్పుడు అన్యాయాలను, అవినీతిని పట్టించుకోని గ్రేటర్ ప్రజలు.

వ్యక్తి కాదు, వ్యవస్థే ముఖ్యమంటున్న తెలంగాణ ప్రజలు.

అప్పుడు సాయుధ పోరాటం, ఇప్పుడు సోషల్ మీడియా ఫైటింగ్.

తెలంగాణ సంపద ఆంధ్ర కాంట్రక్టర్స్ పాలు అంటూ 

ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ .కామ్ ప్రత్యేక కథనాలు. 

స్వార్ధపూరిత రాజకీయాలు లేకుంటే బీజేపీదే అధికారం.

ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ చీఫ్ & మేనెజింగ్ ఎడిటర్ దేవేందర్ రెడ్డి స్టైల్లో 

తెలంగాణ రూటే ~సఫ~రేట్ 

landsandrecords.com 

by 

Devender Reddy 

9848070809


కొట్లాడితే సెటిలర్స్ కి నచ్చదు. వారి అలోచనలో డబ్బులు, బిజినెస్ ఉంటుంది. కాని స్థానికతకు అన్యాయం జరిగితే ఎప్పుడైనా రిజల్ట్ భయట పడుతుంది. కొంచెం అలస్యం అవుతుంది అంతే.. 2009 నుంచి 2015 వరకు కేసీఆర్ అంటే వాళ్ల ఒళ్లు పై పురుగులు పారేవి. కాని అతని పాలన తీరు చూస్తే కాని అర్ధం కాలేదు. 2018 ఎన్నికల్లో భారీ మెజార్జీతో సెటిలర్స్ ఉన్న నియోజకవర్గాలు గెలిచాయి. 2023 కి అదే వారు నమ్ముకున్న బిజినెస్, డబ్బులతో లాబీయింగ్ చేసుకోని కేసీఆర్ నుంచి భారీగా లబ్దిపొందారు. అందుకు కృష్ణా జిల్లాకు చెందిన మెఘా కృష్ణారెడ్డి, నెల్లూరుకు చెందిన బీ శీనయ్య కంపనీ, వైజాగ్ కు చెందిన ఎం వెంకట్రావు కంపనీ, కే పుల్లయ్య శెట్టి ( KPC ) KLR, lead space, Prakash adds , ఇలా చెప్పుకుంటూ పోతే  పాతిక కంపనీలు ఈజీగా ఉంటాయి. తెలంగాణలో వారి కులానికి సంబంధించిన ప్రతిమా, మై హోం తో పాటు పలు మద్యం డిసిలరీస్ .. ఇలా 10 మంది వారి కులాలకు సంబందించిన కంపనీలు లాభపడ్డాయి. 


తెలంగాణ ఆకాంక్ష నేరవేరిందా..? 

నీళ్లు, నిధులు, నియమాకాలు కోసం ఫైట్ చేసిన తెలంగాణ ప్రజలు. ఆ ఆకాంక్ష నేరవేర్చడంలో కేసీఆర్ ముమ్మటికి ఫెయిల్ అయ్యారు. వాగులు , వంకల వద్ద చెక్ డ్యామ్స్ నిర్మించి, చెరువులను కబ్జా కాకుండా కాపాడితే నీళ్ల కరువు తీరేది. కాళేశ్వరం, పాలమూరు అంటూ 2.5 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఇందులో వేల కోట్లు ఉద్యోగుల నుంచి మొదలుకొని కాంట్రక్టర్స్ దోచుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి బిక్ష వేసి.. ఆంధ్ర కాంట్రక్టర్స్ వేల కోట్లు దోచుకున్నారు. ఈఎన్సీలు వందల కోట్లు సంపాదించారు. ఎవ్వరైనా ప్రశ్నిస్తే.. అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేపించారు. తెలంగాణ నిధులు అంతా ఆంధ్రకు వెళ్లుతున్నాయని గగ్గోలు పెట్టిన దాని కంటే.. 1000 రేట్లు ఎక్కువగా ఆంధ్ర కాంట్రక్టర్స్ రూపంలో కమిషన్స్ రూపంలో చేరిపోయాయి. నిధులను కేసీఆర్ ఎక్కువగా ఖర్చు చేసింది కాంట్రక్టర్స్ కోసమే, వారి ఫ్యామిలీ కమీషన్ కోసమే. 


నియమాకాలు. 

అడ్మినిస్ట్రేషన్ అంతా ఆగం చేసినా కేసీఆర్ పాపం పడింది నియామాకాల్లోనే. రెవెన్యూ, పోలీస్, విద్యుత్ రంగాలను బ్రష్టుపట్టించారు. కాని అవేవి ప్రజల్లోకి చేరుకోలేకపోయాయి. ఉద్యోగాల విషయంలో పాలన తీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. నియమాకాల కోసం ప్రాణాలు అర్పిస్తే.. 10 ఏండ్లలో ఒక్క గ్రూప్ వన్ కూడా పూర్తి చేయలేదంటే.. తెలంగాణ ప్రజలు  తాగుబోతు కేసీఆర్ అని ముద్రవేశారు. అప్పట్లో ఆంధ్రవాళ్లు మాత్రమే కేసీఆర్ ని తాగుబోతు అనే వారు కాని తెలంగాణ ప్రజలను నట్టెంట ముంచినందుకు తాగుబోతు, కచరా , అని ఉద్యమ స్పూర్తి ఉన్న వారు అందుకున్నారు. అందుకే ముందుగా సోషల్ మీడియాలో ప్రశ్నించిన ఒక తీన్మార్ మల్లన్న, ఒక బర్రెల అక్క సక్సెస్ అయ్యారు. డబ్బుల కోసం మాత్రమే ఫైట్ చేసినట్లు నటించిన షర్మిలా ఇంట్లో కూర్చుండి భజన చేసుకుంటున్నారు. షర్మిళ లా చాలా మంది ఆంధ్ర వాళ్లు డబ్బుల మీద జాసతోనే అదే ఆంధ్ర కాంట్రక్టర్స్ నుంచి బాగా సంపాదించుకున్నారు. ఇందులో ఆంధ్ర బీజాలు ఉన్నా మీడియా  వాళ్లు ఎక్కడ తగ్గలేదు. డబల్ గేమ్ తో వందల కోట్లు పొగుచేసుకున్నారని అరోపణ.


సాయుధ పోరాటం లాగే సోషల్ మీడియా పోరాటం 

తెలంగాణ ప్రజల ఉద్యమ రూపం మారింది తప్పా.. పోరాట పఠిమ మారలేదు. కాలానికి అనుకూలంగా సాయుధ పోరాటం, తెలంగాణ తొలి, మలి ఉద్యమాలు, ఆత్మబలిదానాలు, ఇలా ఎన్నో సార్లు వారి అన్యాయన్ని , అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న వారి పై ఫైటింగ్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా రూపంలో ఆ ఉద్యమ స్పూర్తి వచ్చింది. 

బీజేపీకి ఛాన్స్ ఉండేది. 

అన్యాయం, అక్రమాలు, అవినీతి జరుగుతుంటే... రాజకీయ లబ్దికోసం మాత్రమే అలోసించిన బీజేపీకి 2023 ఎన్నికలు ఒక గుణపాఠం కావాలి. ఆప్ పార్టీని దెబ్బతీయడానికి లిక్కర్ స్కాం అంటూ భయటకు తీసుకొచ్చారు. కవితను అరెస్ట్ చేస్తామని బండి సంజయే శపథం చేశారు. కాని ఎలాంటి చర్యలు లేవు. అదే కవితను అరెస్ట్ చేసి అన్యాయాన్ని ఎదిరిస్తే ఈ రోజు కాంగ్రెస్ ఉన్న స్థానంలో బీజేపీ ఉండేది. బిజేపీ 3 ఏండ్లు పాలన అనుభవం లేని బండి సంజయ్ ని ప్రెసిడెంట్ గా చేశారు. కాని ఆ మూడేళ్లు మరో వ్యక్తికి ఇచ్చి.. మత విధ్వేశాలు రెచ్చగొట్టి, మాటలు తప్పా.. చేతలు చేతకాని సంజయ్ కి ఈ ఏడాది పార్టీ పగ్గాలు ఇస్తే చాన్స్ ఉండేది. సంజయ్ ని అధ్యక్షత పదవి నుంచి తీసివేసి పెద్ద లీడర్స్ ని చేశారనే విమర్శలు పార్టీలోనే కొనసాగుతున్నాయి. 


Leave a Comment: