Almost Contractors form AP - KCR Ruling for big companies

SCAMS Irrigation & Projects

Posted by admin on 2023-11-29 17:12:05 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 441


Almost Contractors form AP - KCR Ruling for big companies

పాపులర్ లీడర్లు అంతా సైలెంట్ ఓటింగ్ ని ఎందుకు నమ్ముకున్నారు. 

ఇంతలా నెగిటివ్ రావడానికి కారణం సబండవర్గాల వ్యతిరేకతేనా..?

6 వేల మంది తెలంగాణ క్లాస్ వన్ కాంట్రక్టర్స్ ని కాదని..

6 ఆంధ్ర కంపనీలకు పట్టం కట్టిన తీరేనా..

హైదరాబాద్ లోని అండర్ బ్రిడ్జిలు బొల్లినేని శీనయ్య కంపనీకే

అమరజ్యోతి, అంబేద్కర్ విగ్రహామే కాదు టీహాబ్ కూడా ఆంధ్ర కంపనీ కేపీసీ కే అర్హత

ప్లైఓవర్స్  - ఎం వెంకట్రావ్ అండ్ కంపనీకి. 

మిషన్ భగీరథ, కాళేశ్వరం- మేఘా కృష్ణారెడ్డి, ప్రతిమలకే. 

కావాల్సిన వారికే టెండర్ దక్కేలా నియమనిబంధనలు.

6 వేల మంది తెలంగాణ కాంట్రక్టర్స్ కసిగా ఎన్నికల్లో పని చేస్తున్నారా..? 

చిన్న చిన్న కాంట్రక్టులు ఇచ్చినా..

బిల్లులు ఇవ్వకపోవడంతో  అత్మహత్యలు చేసుకున్నారా..?  

తెలంగాణ సంపదను కాకులను కొట్టి గద్దలకు వేసిన తీరు పై

ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ .కామ్ ప్రత్యేక కథనం. 

By

Devender Reddy

9848070809.


మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా మార్చిన కేసీఆర్ సర్కార్ అందులోంచి ఆదాయం అంతా ఆంధ్ర లాబీయింగ్ కాంట్రక్టర్స్ కే చేరింది. అందుకే అనేక అధారాలు ఉన్నాయి. అడ్వటైజింగ్ నుంచి కేబుల్ బ్రిడ్జి వరకు అన్ని ఆంధ్ర కంపనీలకే కట్టబెట్టారు. గత 6 ఏండ్లుగా ఏ1 క్లాస్ కాంట్రక్టులకు వీలు లేకుండా టెండర్లను పిలిచి.. అవమానించారు. ఒక్కప్పుడు హైదరాబాద్ లో ఆఫీసులు వారి వద్ద వందల మంది ఉద్యోగులు ఉన్న కాంట్రక్టర్స్ ఇప్పుడు ఈఎంఐ లు కట్టుకోలేక వాహానాలను అమ్ముకుని ఆఫీసులను ఖాళీ చేసి వేల మంది కాంట్రక్టర్స్ ఇంటి దారి పట్టారు.  టెండర్లు లేకుండా నామినేషన్స్ తోనే అనుకున్న వారికి పనులు అప్పగించారు.  మన ఊరు మన బడి లాంటి స్కీములను సైతం స్కాంగా మార్చే ప్రయత్నం చేశారు. కోర్టుకు వెళ్లితే కాని రద్దుకాని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. 


బొల్లినేని శీనయ్య అండ్ కంపనీ.

బీ శీనయ్య కంపనీ అంటే చాల మందికి తెలుసు ఆయన తెలంగాణ వచ్చే సమయంలో క్లాస్ వన్ కాంట్రక్టరే. ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ చూసిన అండర్ బ్రిడ్జిలకు బీఎస్సీఎల్ అని వ్రాసి పెట్టి ఉంటుంది. 38 ప్యాకేజీల్లో వీరికే ఎక్కువ దక్కేలా టెండర్స్ తయారు చేసుకుని మిగితా కాంట్రక్టర్స్ కి దరిదాపుల రానిచ్చేవారు కాదు. వీరంతా నెల్లూరు జిల్లాకు చెందిన బొల్లినేని కృష్ణయ్య, శీనయ్య కు చెందిన కుటుంబ సభ్యులే నిర్వహిస్తుంటారు.


అమరజ్యోతి, అంబేద్కర్ విగ్రహామే కాదు టీ హాబ్ కూడా ఆంధ్ర కంపనీలే. 

ఆంధ్రప్రదేశ్ లోని కడపకు చెందిన కంపనీ అయినా కే. పుల్లయ్య శెట్టి  కుటుంబానికి సచివాలయానికి ఇరువైపుల ఉన్నా అమరవీరుల  ఆశయ నిలయం అమరజ్యోతిని వారే నిర్మించారు. టీ హబ్ ని కూడా అనిల్ కుమార్ కామిశెట్టి కి చెందిన వారికే ఇచ్చేశారు. కేటీఆర్ బావమర్ధులకు చాల దగ్గర సంబందాలు ఉండటంతో ఈ పనులన్ని వారికి అనుకూలంగా జరిగాయని విశ్వసనీయ సమాచారం. 


ఎల్ అండ్ టీ కి సమానంగా  ఎం. వెంకట్రావ్ కంపనీ. 

రూ. 233 కోట్లతో నిర్మాణం అయినా కేబుల్ బ్రిడ్జిలో సబ్ కాంట్రక్ట్స్ వైజాగ్ కి చెందిన ఎం. వెంకట్రావ్ కంపనీకి ఇవ్వాల్సిందేనని యువరాజా మనుషులు పట్టుపట్టారట. ఇలా అనేక రోడ్లు, ప్లై ఓవర్స్ ఎం. వెంట్రావ్ కంపనీయే నిర్మించి గుట్టుచప్పుడు కాకుండా కమిషన్స్ ఇచ్చేశారట. 



మేఘాకి ఘనమైన వాటనే.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ని క్యాష్ ప్రాజెక్ట్ మార్చిన మెఘా కంపనీ మూడో టీఎంసీకి నామినేషన్స్ ద్వారానే ఎక్కవ పనులు కట్టబెట్టారు. 40 వేల కోట్ల మిషన్ భగీరథ పైపుల తయారీ లోనూ వారికే టెండర్స్ దక్కెలా వ్యవహారించారు. తమ వర్గానికి చెందిన ప్రతిమా గ్రూప్ ఒక్కటే తెలంగాణ కంపనీగా ఉంది. ఏ టెండర్ ఎక్కడ ఎలా పాడుకోవాలో ప్రతిమా శ్రీనివాస రావు ( బొయినిపల్లి శ్రీనివాసరావు) చెప్పుచేతుల్లో నడిచేదని తెలంగాణ కాంట్రక్టర్స్ అరోపిస్తున్నారు. 7 వేల కోట్ల స్కీం మన ఊరు మన బడిలోనూ.. తెలంగాణ కాంట్రక్టర్స్ ని రానివ్వకుండా కుట్రలు చేశారు. ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ చీఫ్ ఎడిటర్ దేవేందర్ రెడ్డి ఇన్వెస్టిగేషన్  కథనాలు అందించారు. ఆ తర్వాత కోర్టులో టెండర్స్ రద్దయ్యాయి. 


అడ్వటైజింగ్ లోను ఆంధ్ర లీడ్ స్పేస్ యే..

మెట్రో పిల్లర్స్ వాణిజ్య ప్రకటనలు నామినేషన్ పద్దతిలోనే లీడ్ స్పెస్ కంపనీకి అంటగట్టారు. ప్రకాశ్ యాడ్స్ లీడ్ స్పెస్ కంపనీలే 65 శాతం ఔట్ డోర్ మీడియా మార్కెట్ ని కొల్లగొట్టారు. వారికే ట్రాఫిక్ అంబరిల్లా యాడ్స్, బస్సు షెటర్స్, సైన్ బోర్డ్స్ , స్లీపర్స్ మిషన్స్ దక్కెలా అప్పటి జీహెచ్ఎంసీ ఐపీఎస్ ఆఫీసర్ చేతులు కలిపారని ప్రత్యేక కథనాలు ఇచ్చాం. 


బిల్లులు రాక సర్పంచులు అత్మహత్య. 

ఆంధ్ర బడా కాంట్రక్టర్స్ కి త్వరగా బిల్లులు పాస్ చేయించిన తెలంగాణ ప్రభుత్వం 6 వేల మంది క్లాస్ వన్ కాంట్రక్టర్స్ ని పక్కన పెట్టేసింది. వారి వాహానాలకు ఈఎంఐలు కట్టలేక దివాల తీశారు. మరో వైపు గ్రామాల్లో పనులు చేసిన సర్పంచులకు బిల్లులు ఇవ్వకపోవడంతో ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఉన్నాయి. అంటే ధనిక రాష్ట్ర సంపద ఆంధ్ర కాంట్రక్టర్స్ చేతిలోకి వెళ్లిందని చెప్పడానికి అనేక అధారాలు ఉన్నాయి.  


Leave a Comment: