KCR Ruling memories.

NEWS ANGLE for all parties

Posted by admin on 2023-11-29 02:47:51 | Last Updated by admin on 2025-07-03 20:15:32

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 738


KCR Ruling memories.


10 ఏండ్ల కేసీఆర్ పాలనను నెమరు వేసుకుంటున్న ప్రజానీకం.

అచ్చం నిజాం పాలనే అనుకుంటున్న తీరు.

అభివృద్ది అంటూ ఆర్తనాదాలను పట్టించుకోలేదు. 

కాళేశ్వరం పేరుతో కేసీఆర్.

ఒక కులానికే ధరణి, మైనింగ్, మద్యం మాఫియాను పెంచిపోషించిన తీరు. 

తమవారు తప్పు చేస్తే చట్టాన్ని చుట్టంలా మార్చుకున్నారు.

పాలనకు పడకేసిన వ్యవహారంతో అధికారులు వందల కోట్లు సంపాదించారు.  

ప్రజా సమస్యలే లేవంటూ నివాసాన్ని గడిగా మార్చుకున్న వైనం.  

కేసీఆర్ ది ముమ్మంటికి నియంత పాలన అనేందుకు మచ్చుగా కొన్ని ఘటనలు.

Landsandrecords.com లో...

By

Devender Reddy 

9848070809

పదేళ్ల పాలన పై వ్యతిరేకత ఉండటం సహజం. సగం జనాభా కేసీఆర్ ఒక్క సారి పోవాలి అనే మాట అనడం వెనక అయన పాలనలో అనేక ఘటనలు గుర్తు చేసుకుంటున్నారు. అహంకారపూరితమైన చేష్టలు. అందినకాడికి దొచుకునే కుటుంబ పాలన కావడమే ఇందుకు నిదర్శనం.

కేసీఆర్ కొంప ముంచిన మాటలు- చేతలు.  

1. పట్టపగలు న్యాయవాదుల దంపతులను నడిరోడ్డుపై వేటకొడవళ్లతో నరికి చంపిన ఇప్పటికి శిక్ష పడలేదు. కుట్రదారులు ఆయన పార్టీ లీడర్స్ కాబట్టి పట్టించుకోలేదు.   

2. గ్లోబరియా తప్పులకు 27 మంది ఇంటర్ విద్యార్థులు మరణించినా తమ కుటుంబ సభ్యులు ఎక్కడ ఇరుక్కుంటారోనని పెడచెవిన పెట్టిన తీరు.

3. న్యాయం చెయ్యాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొడుకును ఆశ్రయిస్తే.. నీ పెళ్ళాన్ని పక్కలోకి పంపు అని చెప్పడం సిగ్గు చేటు. దాని  ఫలితంగా ఆ కుటుంబం మొత్తం సూసైడ్ చేసుకుంటేనే భయటకు రావడం ఈయన ఎమ్మెల్యేలకు వారి కుటుంబాలకు ఇచ్చిన ఫ్రీడం తెలుస్తుంది.  కాని మళ్లీ అదే తండ్రికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేంత బరితెగింపు నిర్ణయాలే కేసీఆర్ పోవాలి అనుకుంటున్నారు. 

4. TSPSC  పేపర్ లీక్ లతో  ప్రవల్లిక లాంటి సూసైడ్ లు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం వస్తే చుట్టు నా పది కుటుంబాలు బాగుపడుతాయి అనుకుంటూ ..  ఐదు రూపాయల బువ్వతో  లైబ్రరీలో చదివే నిరుద్యోగుల అర్ధనాదాలు ఒక్కసారి కూడా కనిపించలేదు. అధికారుల పై చర్యలు తీసుకోలేదు. 

5. ధరణితో మళ్లీ దొరలకు భూములు అప్పగించి తీరు పేద ప్రజలు గమనిస్తున్నారు. వీఆర్ఓ వ్యవస్థ పై పాపం నెట్టివేసి .. పోజిషన్ సర్వేలు చేయకుండా పచ్చటి  ఊర్లలో చిచ్చులు పెట్టిన తీరు ఇంకా ఉంది.  పాస్ బుక్కులో తన భూమి లేదని సిరిసిల్లలో ఓ రైతు తనకు తానే కాష్టం పేర్చుకొని కాల్చుకున్న తీరు ఇందుకు నిదర్శనం. 

6. నల్గొండ, ఖమ్మంలో అన్నం పెట్టె రైతన్నలకు సంకెళ్లు, ఖమ్మంలో పోడు పట్టాలకోసం పోరాటం చేసిన తల్లి బిడ్డలకు జైళ్ల లాంటి నిర్ణయాలకు నీకు సంబందం లేనట్లుగా ఉండటం పాలనకు పాకురు పట్టించిన తీరు కనిపిస్తుంది. 

7. బైసా బాలిక అత్యాచారం లాంటివి జరుగుతునే ఉన్నాయి. దిశ ఎన్ కౌంటర్ తో పేరు సంపాదించుకున్నా.. బీఆర్ఎస్ నేతల పై ఉన్న అత్యాచార పిర్యాదులను కోట్టివేశారు.

8.  కొండగట్టు  బస్సు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలను పరామర్శించే సమయం లేని ముఖ్యమంత్రి తెలంగాణను వ్యతిరేకించిన సినిమా ఇండ్రస్టీ పెద్దల చావుకు గంటల సమయం దొరుక్కుద్ది. చావులతో వచ్చిన రాష్ట్రం క్రెడిట్ ఒక్కడి ఖాతాలో వేసుకున్న కల్వకుంట్ల చంద్రశేఖర్.. పాలనలో కొత్త చావులకు బాధ్యత తీసుకోలేక పోవడం తెలంగాణ సమాజం గుర్తు చేసుకుంటుంది.

9. కాళేశ్వరం అవినీతిలో మునిగిన పాలకులకు మల్లన్న సాగర్ లో ఇల్లుపోయిందని  ఓ పెద్దాయన తన పూరి గుడిసెనే చితిగా మార్చకున్నఘటన కేసీఆర్ కి గుర్తుకు లేదు. మరియమ్మను సెల్లో చంపేస్తే పోలీసులపై డిస్మిస్ లతోనే చేతులు దులుపుకున్నది గుర్తు చేసుకుంటున్నారు. సంగారెడ్డిలో పేద ముస్లింను దొంగ అనే ముద్రేసి కొట్టి చంపేస్తే మాట్లాడిన వాళ్ళు లేరు. ఇసుక మాఫియా తీరు ఎలా ఉంటుందో నేరెళ్ల దళితుల పై పోలీసుల థర్డ్ డిగ్రి  ఒక్కటి చాలు. డబ్బుల కోసం వాడవాడకు బెల్ట్ షాపులను పెట్టించి తాగుబోతు తెలంగాణను చేసింది కనపిస్తుంది. ఎలక్షన్ కమిషన్ వాటన్నింటిని తీసివేస్తే ఊర్లు ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి. బంగారు బాతులాంటి హైదరాబాద్ భూములను అనుకున్న కంపనీలకు కట్టబెట్టి కాసులు సంపాదించిన తీరును నెమరు వేసుకుంటున్నారు. అభివృద్ది , శాంతి భద్రతలు అంటూ కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి చెప్పుకుంటూ పోతే ఒక రోజు చాలదు. రాసుకుంటూ వెళ్లితే ఒక్క పుస్తకం సరిపోదని పరిపాలన తెలిసిన మేధావులు అంటున్నారు.  

బుద్ది చెప్పాల్సిన ఆయనకు- బుద్దిచెప్పాల్సిన రోజు వచ్చిందా..? 

సంపద ఎక్కువై కళ్లు నెత్తికి ఎక్కితే బుద్ది గడ్డి తింటుంది. అందుకు అధికార అహంకారం తోడై మరోసారి మనదే అనుకుంటూ.. ప్రతిపక్షలు ఇంకా నిద్ర లేవనే లేదు  అని తప్పుల మీద తప్పులు చేసిన పెద్దయనకు బుద్ది చెప్పాల్సిన రోజులు వచ్చాయని ఆయన తీరును గుర్తు చేసుకుంటున్నారు. పాలనను పడకేపించి అధికారులను మొద్దు నిద్రలోకి వదిలేశారు. కలెక్టర్స్ వందల కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఇంటలిజెన్స్ నివేదికలు ఉన్నా ఏనాడు పట్టు సాధించలేకపోయారు. వీళ్లు పాలకులు కాదు నియంతలు, అవినీతిపరులు, జనాల మానప్రాణాలను దోచేస్తున్న దొరల రూపంలోని దొంగల ముఠా అని విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి  అధికారిక నివాసాన్ని గడీల్లాగా మార్చిన ఈ దొరదోపిడీ దారులు మూటాముల్లె నెత్తిన పెట్టుకుని పోతుంటే చూసి ఆనందించే వాళ్లలో నేనూ ఒకడినని ప్రజాస్వామ్య బద్దంగా పాలన కోరుకునే జర్నలిస్టులు ఆశపడుతున్నారు. ఎవరికైనా సరే ప్రజల్లో ఒక్కసారి ద్వేషం అనేది పెరిగిందంటే.. వారు తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, అకృత్యాలు వారి చర్యల మీదే ఆధారపడి ఉంటయ్. 


landsandrecords.com | KCR 10 years ruling | KCR - Nizam ruling same | KCR Niyantha

Leave a Comment: