Posted by admin on 2023-11-27 12:28:48 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 351
బీఆర్ఎస్ కు ట్రబుల్ గా మారిన ట్రబుల్ షూటర్ హరీష్ రావు.
ప్రజాస్వామ్యంతో తమాషాలు ఆడితే ఇలానే ఉంటుంది. .
పదవులతో పరిహాసం చేసి వేల కోట్లు సంపాదిస్తే ప్రజల చేతిలో శిక్షలు తప్పదని నానుడి.
ఇరుకున పడటంతో ఫేక్ మెస్సెజ్ లతో మెనేజ్ చేస్తున్న హరీష్ టీం.
10 ఏండ్లుగా ప్రజాస్వామ్యాన్ని-రాజరీకంలా అనుభవించిన కుటుంబమని అరోపణలు.
పాపం పడింతే తాడు కూడా పాములా కరుస్తుంది.
రైతుబంధుతో పాటు సైలెంట్ ఓటింగ్ గట్టెక్కిస్తుందని ఆశ పడ్డ బీఆర్ఎస్.
ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ లో బీసీ బంధు లేదు, గృహా నిర్మాణాలకు నిధులు లేవు.
పకృతి పగపడితే పాపాలు అన్ని ఒక్కొక్కటి భయటకు వస్తుంటాయి.
సమస్యను సింగిల్ హాండ్ తో నడిపించే హరీష్ రావు సింగిల్ వర్డ్ తో దుమారం.
5 వేల కోట్ల బంధును బంద్ చేయించిన తీరు పై స్పెషల్ స్టోరీ.
ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ . కామ్ బ్యూరో.
By
Devender Reddy.
9848070809.
అన్ని సమకాలంలో నడిచేందుకు పకృతి , సమయం వాటి ప్రభావం చూపిస్తుంటాయి. అందుకే పాపం ఎక్కువ చేసిన వారిని కంట్రోల్ చేస్తుంటుంది. బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని కష్టాలు వచ్చినా.. సింగిల్ హ్యాండ్ తో నడిపించిన హరీష్ రావు. సింగిల్ వర్డ్ తో తెలంగాణలో గెలుపు అంచుల్లోంచి కిందికి పడేశారని బీఆర్ఎస్ నేతలే విమర్శిస్తున్నారు.
టింగ్ , టింగ్ అని దశాబ్దంగా రాలేదా..?
ప్రజలకు అర్ధిక సహాయం చేసేది ప్రజల ఆర్ధిక వ్యత్యాసలను తగ్గించేందుకు మాత్రమే. కాని రైతు బంద్ అంటే బలిసిన దొరలకు మాత్రమే మేలు చేసేలా పట్వారీ గిరిని మళ్లీ ప్రవేశపెట్టారని ఆరోపణలు ఉన్నాయి. అధిపత్యం మొత్తం పెత్తానుదారులదే... లబ్దిపొంది ఓట్లు వేస్తారని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి నమ్ముతుంది. అందుకే టింగ్ టింగ్ అని వచ్చిన ప్రతి సారి లక్షలాది కౌలు రైతుల కళ్లలో నీళ్లు తిరుగుతుంటాయి. హైటెక్ కాలం మారినా అదిపత్యం మాత్రం బడాబాబులదే. ఇన్నాళ్లపాటు మేము ఏదీ చేసినా నడుస్తుందని ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్లే ఇప్పుడు ఆ పార్టీకి మేలు జరిగేలా మాట్లాడుకోవడం. వారి ఇంట్లో నుంచి డబ్బులు ఇస్తున్నట్లు ప్రచారం చేసుకోవడంతో మొదటికే మోసం వచ్చింది. రైతులకు చేరాల్సిన 5 వేల కోట్లు.. ఒక్క మాటలో చెడగోట్టారని చెప్పడంలో తప్పే లేదు. అందుకే ట్రబుల్ షూటర్ బీఆర్ఎస్ కు ట్రబుల్ గా మారాడు.
ఫేక్ లేటర్స్.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సెంట్రల్ గవర్నమెంట్ సహాయం 3 వేలు నోటీఫికేషన్ వచ్చిన తర్వాతనే టింగ్ టింగ్ మని శబ్దాలు వచ్చాయి. కాని హరీష్ రావు మాటలతో వద్దని కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నిరంజన్ పిర్యాదు చేశారు. ఇలా నిరంజన్ ఎన్నికల సమయంలో వందల పిర్యాదులు చేసి ఉంటారు. కాని కమీషన్ అవ్వన్నీ పట్టించుకోలేదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల సమయంలో ఓటర్ ని ప్రభావితం చేసే ఘటనల పై.. రాజకీయనాయకుల పరిధి చాలా స్పష్టంగా ఉంది. కాని తామంతా రాజులైనట్లు.. వారి ఇచ్చే డబ్బులతోనే అంతా సస్యశామలంగా ఉన్నట్లు చూడటం ఇబ్బందిగా మారుతుంది. అలాగే రేవంత్ రెడ్డే నేరుగా పిర్యాదు చేశారని ఫేక్ లేటర్ తయారు చేయడం కూడా హరీష్ రావు టీంకి భూమ్ రంగ్ అయింది.