Posted by admin on 2023-11-26 07:25:34 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 213
By
Devender Reddy
9848070809.
ఎన్నికల్లో గెలుపు ఓటములు సహాజం. కానీ గెలిచేందుకు ఏ వేషాలైన వేస్తారు పొలిటిషన్స్. అందుకు బీఆర్ఎస్ భవన్ నుంచి డబ్బులు సప్లై చేస్తున్న తీరు నిదర్శనం. పార్టీ మెటిరీయల్ సప్లై పేరుతో భారీగా నగదు కాటన్స్ భయటకు వెల్లుతున్నాయి. రాత్రికి రాత్రి వారి ఛానల్ ఆఫీస్ లో డంపు చేస్తున్న కోట్లాది రూపాయలు బీఆర్ఎస్ లీడర్స్ కి చేరుతున్నాయి. అయితే అక్కడ ఓ మార్కెటింగ్ ఫర్సన్ మేనేజ్ చేయడం ఎక్కడికైనా డబ్బులు పంపిచేస్తున్నారు. ఆ ఛానల్ లో పనిచేస్తున్న జర్నలిస్టులకు జీతాలు పెంచాలని ఏడాది క్రితం ధర్నాలు చేశారు. 4 ఏండ్లకు ఒక్కసారి 10 నుంచి 20 శాతం పెంచి వారి జీవితాలతో అడుకుంటున్నారు. ఎన్నికల సమయంలో వారి కళ్ల ముందు నుంచే వందల కొట్లు వెళ్లుతుంటే ఏ పార్టీ అయినా ప్రజలను ఎలా వాడుకుంటారో అర్ధమవుతుంది.
బంపర్ ఆఫర్
ఎన్నికల సమయంలో డబ్బే అంతా అనుకుంటున్న సంతోష్ అండ్ టీం చేయని దందా లేదు. రియల్ ఎస్టేట్ కంపనీల్లో లిటిగేషన్ ఉన్న భూములను క్యాచ్ ఇస్తే మూడో కంటికి తెలియకుండా క్లియర్ చేయాలని అదేశాలు వెళ్లుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవని అధికారులకు హామిలు ఇస్తున్నారు.. ప్రభుత్వం వచ్చినా తర్వాత ఫైల్ పూర్తిగా క్లియర్ చేస్తామని కొన్ని కీలక రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భరోసా ఇవ్వడంతో డబ్బులు వచ్చి పడుతున్నాయి.
డంపింగ్ డీల్స్ ..
ఎలక్షన్స్ కంటే 3 నెలల ముందే కాళేశ్వరం క్యాష్ ఓనర్ ప్రాజెక్ట్ పంపకాలు చేసింది . 90 నియోజక వర్గాలకు గాను 50 ప్రాంతాల్లో సొమ్మును దాచిపెట్టారు. పెట్రోల్ బంకులు, రైస్ మిల్లులు, సీడ్స్ కంపనీలు, పార్టీ కార్యాలయాలు, స్మశాన వాటికల్లో 900 కోట్ల నగదు నియోజకవర్గాలకు చేరుకుంది. పోల్ మేనెజ్మెంట్ కి ఈ నగదు సరిపోకపోవడంతో 5 వేల కోట్లు ఇప్పటికి ఇప్పుడు వివిధ సర్వీస్ లతో డబ్బును సరఫర చేస్తున్నట్లు తెలుస్తుంది. నిఘా వర్గాలకు విశ్వసనీయత సమాచారంతో విషయాన్ని చేరవేసినా ఎక్కడ చర్యలు తీసుకోకపోవడంతో ప్రజాస్వామ్యంలో డబ్బుదే చివరి గెలుపులా మారుతుంది.