Posted by admin on 2023-11-26 02:23:13 | Last Updated by admin on 2025-07-03 20:15:32
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 450
By
Devender Reddy
9848070809
ఓటర్ నాడీ పట్టుకుని ఎవ్వరు గెలుస్తారో అంచనాలు వేసే సర్వే సంస్థలు.. సోషల్ మీడియాను నమ్ముకుని ఏసీ గదుల్లో కూర్చుని రిజల్ట్ లు విడుదల చేస్తున్నారు. కొన్ని సంస్థలు యూట్యూబ్ , ఫేస్ బుక్ , ట్విటర్, ఇన్స్ట్రా గ్రామ్ లాంటి వ్యూస్, కామెంట్ల తోనే సర్వేలు నివేదికలు ఇస్తుండగా.. మరి కొన్ని ఆయా ప్రధాన పార్టీలతో అనుబంధం ఏర్పాటు చేసుకుని ఆ పార్టీలకు అనుకూలంగా నివేదికలు తయారు చేసుకుంటున్నాయి.
A - PAC to Z PAC
ఆయా సర్వే సంస్థలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న రిపోర్టులు ఇలా ఉన్నాయి.
సర్వే సంస్థ పేరు | బీజేపీ | బీఆర్ఎస్ | కాంగ్రెస్ | ఇతరులు |
Forensic Election Survey | 0-3 | 11-26 | 61-84 | MIM -5 CPI -1 |
Newstap Survey | 1-4 | 65 | 32 | MIM - 6 Tight - 11 |
Q3 Research & Innovations | 4-6 | 36-40 | 68-72 | MIM -5 -7 others- 0-1 |
Telangana OU Jac Survey Telangana Lok Poll Mega Survey | 5 2-3 | 24 36-39 | 82 69-72 | MIM-7 CPI - 1 MIM - 5-6 others -1 |
అయితే ఇవ్వన్ని నవంబర్ 21న , ఆ తర్వాత చేసినట్లు ప్రకటించుకున్నారు. కాని వీరంతా సోషల్ మీడియా రియాక్షన్స్ తో పని చేసినట్లు కనిపిస్తుంది. ఇవే కాకుండా.. i-PAC లా.. సర్వేల పేర్లతో B-PAC, C-PAC, D-PAC అంటూ Z వరకు పేర్లు పెట్టేసుకుని సర్వే రిపోర్టులు అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఆయా పార్టీల నేతల మన్నేలను పొందేందుకు సర్వే సంస్థల పేర్లతో ముందుకు వస్తున్నారని తెలుస్తుంది. అయితే బెట్టింగ్ రాయుళ్లు సైతం ఈ సర్వేలను చూసి గందరగోళంలో పడిపోతున్నారు. కోట్లాది రూపాయలు బెట్టింగ్ రూపంలో ఇప్పటికే కాయ్ రాజా కాయ్ అంటూ పెట్టుబడులు పెడుతున్నారు.
అంచనాలు అందుకోలేకపోతున్నారు.
ఎన్నికల్లో గెలువాలంటే చాల లెక్కలు ఉండాలి. ప్రజల్లో ఒకే వైపుగా పిచ్చి ఉండాలి. కాని బీఆర్ఎస్ అండ్రాయి సెల్ ఫోన్ వాడని వారంతా సైలెంట్ ఓటింగ్ రూపంలో దాగి ఉంది. బీజేపీ- బీఆర్ఎస్ ఒక్కటే అంటున్నందున ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు వీలుగా రెండు పార్టీలు ఉన్నాయి. దీంతో మాట ఇచ్చినా.. డబ్బులు తీసుకున్నా.. మరిచిపోలేని తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఆ క్షణమే అలోచిస్తారు. ఇక ఇప్పటికే బీజేపీ సెంట్రల్ ప్రభుత్వం 3 వేల రూపాయలు రైతుల ఖాతాలో వేసింది. రైతు బంధు పేరుతో ఈనెల 28 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం పైసలు ఓటర్ కి అఫిషియల్ గా చేరుతున్నాయి. బీసీ బంధు, దళిత బంధు, గృహా లక్ష్మి, సీఎంఆర్ఎఫ్, ఛాదీ ముబారాక్, స్కాలర్ షీప్స్ లకు అనుమతులు అడగలేదని కాంగ్రెస్ అడుగుతుంది. కాని పోలింగ్ నాటికి ఆర్ధిక కష్టాల్లో ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఎన్ని ఎకరాలకు డబ్బులు ఇస్తుందో నని తెలంగాణ రూరల్ పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు.
News angle | All parties | Exclusive Stories on Surveys | pre - Survey trend