Posted by admin on 2023-11-24 02:55:37 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 742
By
Devender
Reddy
9848070809.
బీఆర్ఎస్ లో అత్యంత బిజీగా వ్యక్తి రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు.
ముఖ్యమంత్రికి అన్ని తానై దగ్గరుండి చూసుకునే వ్యక్తి. అందుకు ఆయన
తనకంటూ ఓ నెట్ వర్క్ ను సంపాదించుకున్నారు. అటు కేటీఆర్ తో ఇటు హరీష్ రావుతో
సంకేతగా ఉంటూ అందరి పరిచయాలను ఎలా వాడుకోవాలో తెలిసిన ఘనుడు. అలాంటి వ్యక్తి
కోన్నాళ్లుగా కేసీఆర్ వెన్నంటి కనిపించడం లేదని వార్తలు వచ్చాయి. ఆయన
కనిపించకపోవడానికి కారణం ఏంటని వెతికితే.. ఫండింగ్ కోసం పరాషాన్ లో ఉన్నారని
ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ కి తెలిసింది. ఈ సారి ప్రభుత్వం రాకపోతే మన పరిస్థితి
ఏంటీ అనే గుబులుతో నానా కష్టాలు పడుతున్నారని , ప్రభుత్వం, తమ పార్టీ
నుంచి లబ్దిపొందిన రియల్ ఎస్టేట్ కంపనీలకు డబ్బులు సమకూర్చాలని అదేశించారుకీ.
అందుకు ఓ ఎమ్మెల్సీ తో పాటు ఓ మీడియా ఓనర్ కీలకంగా పాత్ర పోషిస్తున్నారు.
దుబాయి నుంచే అగ్రిమెంట్లు.
ప్రభుత్వం నుంచి లబ్దిపొందిన కంపనీలు అగ్రిమెంట్లతో ఫైనాన్సర్స్ వద్ద
నుంచి డబ్బులు పొగుచేసుకుంటున్నారు. ఇప్పటికే జూబ్లిహిల్స్ లోని రెండు , గచ్చిబౌలిలో 2 భారీ కమర్షయల్
భవంతులను ఫినిక్స్ సంస్థ 2500 కోట్లకు ఏపీ ప్రభుత్వ పెద్దలకు అమ్మేసింది. ఈ అగ్రిమెంట్లు అన్ని దుబాయి నుంచే కొనసాగాయి. శ్రీనిధి శ్రీహరి టీంలోని
సభ్యులు ఈడీ కేసులకు భయపడి అక్కడే ఫర్మినెట్ గా ఫ్యామిలీతో సెటిల్ అయ్యారు.
సంతకాలు అన్ని అక్కడి నుంచే అవుతున్నాయి. ఫినిక్స్ , శ్రీనిధి నగదు 2500 కోట్లు
సరిపోకపోవడంతో సాహితీ, వంశీరాం, డీఎఎస్ఆర్, ప్రణీత్ ప్రణవ్, వాసవి, ఘర్, రాజపుష్పా,అరబిందో నుంచి భారీగా డబ్బులు
పొగుచేశారు. పోలింగ్ నాటికి రియల్ ఎస్టేట్ కంపనీల నుంచి దశల వారిగా మరో 2500 కోట్లు తెప్పించుకునే ప్రయత్నంలో
సంతోష్ రావు నిమగ్నమయ్యారని బీఆర్ఎస్ నేతలే అంటున్నారు.
బెంగళూర్ నుంచి సాహితీ లక్ష్మినారాయణ కో-అర్డినేషన్.
3 వేల మందిని ముంచిన సాహితీ లక్ష్మినారయణ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఎలక్షన్ ఫండింగ్ కోసం తనవంతుగా అష్టకష్టాలు పడుతున్నారు. మైహోం బూజా లో ఉండే పూర్ణచందర్ అండ్ గ్యాంగ్ అందరితో కలిసిపోయి డబ్బులు సమకూర్చుతున్నారు.
పైసల కోసం ఫినిక్స్ గోపి కృష్ణ, ప్రణీత్ నరేందర్ .?
నార్త్ లో రియల్ ఎస్టేట్ లో కింగ్ పిన్ గా ఉన్న ప్రణీత్ నరేందర్ కామరాజు బీఆర్ఎస్ 10 ఏండ్ల ప్రభుత్వంలో 1000 కోట్ల భూములు కూడపెట్టారు. ఇందులో ఇంకా వివాదస్పద భూములు క్లియర్ చేసుకోవాల్సి ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రోడ్డు మీదికి వచ్చే అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ కోసం ఫినిక్స్ గోపికృష్ణ ద్వారా భారీగా నగదును సమకూర్చేపనిలో జూబ్లిహిల్స్ లో బిజీగా గడుపుతున్నారని తెలుస్తుంది.
ప్రత్యర్ధుల సొమ్ము మాత్రమే పోలీసులకు కనిపిస్తుందా.. ?
ఎన్నికల్లో ఇప్పటి వరకు పోలీసులు పట్టుకున్న నగదులో కాంగ్రెస్ పార్టీవే ఎక్కువగా ఉన్నాయి. బీఆర్ఎస్ సొమ్ము వందల కోట్లు భద్రంగా ఓటర్లకు చేరేలా ప్రత్యేక సిక్టర్స్ ని కార్లకు అంటిస్తున్నారు నేరుగా సంతోష్ రావు ఆయా అభ్యర్ధులతో మాట్లాడి అక్కడికి డబ్బులు చేరవేయడంలో సక్సెస్ అవుతున్నారు. హైవేలో, ఓఆర్ఆర్ లో 66,666,6666 నెంబర్ కార్లు బీజిగా రాత్రి పూట తిరుగుతున్నాయని సమాచారం. మురికితో ఉన్న కార్లను ఆపడానికి వీలు లేకుండా కొంత మంది ఆఫీసర్స కి ఇన్స్ట్రక్షన్స్ వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం.
కొసమెరపు
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కొంపకొల్లెరు అవుతుందని భావిస్తున్న రియల్ ఎస్టేట్ కంపనీలు బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ కి డబ్బులు ఇచ్చేందుకు రేడీ అయ్యారు. బీఆర్ఎస్ కి 50 కోట్లు సమకూర్చితే.. కాంగ్రెస్ కి 5 కోట్లు ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు కొంత మంది బిల్డర్స్.