Posted by admin on 2023-11-20 17:12:08 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 354
By
Devender Reddy
9848070809
కింది స్థాయి అధికారులు తప్పు చేస్తే వెంటనే శిక్షిస్తున్న ఐఏఏస్ లు వారి పై ఉన్న కోర్టు కేసుల్లో దశాబ్దాలు అవుతున్న తుది తీర్పులు రావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల పైనే న్యాయవ్యవస్థలో న్యాయం అలస్యం కావడంతో బాధితులు వారి పై ఫైట్ చేసేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చట్టాలు ఉన్నా అవి పేపర్ వరకే పరిమితం అవుతున్నాయి. సుప్రీం కోర్టులు గైడ్ లైన్స్ ఉన్నా పట్టించుకోకుండా కింది కోర్టుల్లో ఏండ్లకు ఏండ్లు విచారణ కోనసాగుతునే ఉన్నాయి. దీంతో ప్రజాస్వామ్యంలో మూడు వ్యవస్థల పై నమ్మకం సన్నగిల్లుతుంది.
2011 నుంచి నవీన్ మిట్టల్ పై ఎన్ఓసీ స్కాం. – మంగళవారం విచారణ.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2008 నుంచి 2010 వరకు హైదరాబాద్ కలెక్టర్ గా నవీన్ మిట్టల్ పని చేశారు. ఈయన కాలంలో ప్రభుత్వ భూములు ఎన్నో అన్యాక్రాంతం అయ్యాయని నటరాజ్ గుల్జార్ నివేదకలో తెలాయి. గుడిమల్కాపూర్ లోని 5,600 గజాల స్థలాన్ని శాంతి అగర్వాల్ వేలంపాటలో తీసుకుంది. కానీ నవీన్ మిట్టల్ మాత్రం వేరే వారికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. 2010 లో ఈ కేసు సంచలనంగా మారింది. 80 ఏండ్ల మహిళ తన భూమి కోసం ఫైటింగ్ కొనసాగించింది. దీంతో పాటు సనత్ నగర్ లో 4 వేల గజాలు. బతుకమ్మ కుంటలో 10 వేల గజాలు అక్రమాలు జరిగాయని తెలింది. మొత్తం ఆ రోజుల్లో 30 కోట్ల భూ అక్రమాలకు అప్పటి కలెక్టర్ నవీన్ మిట్టల్ కీలకంగా వ్యవహారించారని అరోపణలు ఉన్నాయి. రిట్ పిటిషన్ 766 /2011 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2017లో జస్టిస్ రామచంద్రరావు ఆ కేసుల్లో నవీన్ మిట్టల్ తీరును తప్పు పడుతు జరిమాన విధిస్తూ తీర్పు నిచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పై ఐఏఏస్ నవీన్ మిట్టల్ రిట్ అప్పిల్ 686/2017 కు వెళ్లారు. ఇదే సమయంలో సుప్రీం కోర్టులో శాంతి అగర్వాల్ కంటెప్ట్ కేసు వేయగా హైకోర్టులో విచారణలో ఉన్నందున క్రిమినల్ కేసు పై నిర్ణయం తీసుకోలేమని సుప్రీం కోర్టు తెలిపింది. 2017 నుంచి ఇప్పటి వరకు ఇంకా విచారణ జరగుతూ వస్తునే ఉంది. 21-11-2023న లిస్ట్ చేసి ప్రధాన న్యాయమూర్తి విచారణ ఏలా జరుగుతుందో ఆసక్తిగా మారింది. పుష్కార కాలం పూర్తి అయినా ఆనాటి 30 కోట్ల భూ వ్యవహారాల పై ఐఏఏస్ అధికారి పైన తీర్పులు రాకపోవడంతో.. ఇప్పుడు సీసీఎల్ఏ కమిషనర్ గా ధరణితో పాటు అనేక భూములు ఆయన చెప్పుచేతుల్లో పెట్టడంతో ఎన్ని వేల కోట్ల భూములకు రెక్కలు వచ్చాయో కొద్ది రోజుల్లోనే భయటపడనున్నాయి. నవీన్ మిట్టల్ పై ఇప్పటి వరకు 74 కోర్టు దిక్కరణ కేసులు నమోద అవ్వడం పై చట్టాలను ఎలా అమలు చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.
వ్యక్తిగత పరువునష్ట దావాలో స్మితా సభర్వాల్ కి 15 లక్షలు.
ఫ్యాషన్ షో లో పాల్గొనడం అధికార విధులు ఎలా అవుతుందని తెలంగాణ హైకోర్టు ప్రశ్నిస్తూ.. అవుట్ లుక్ మాగ్జిన్ వేసిన కథనానికి స్మితా సభర్వాల్ దాఖలు చేసిన పరువు నష్టం కేసుకి సంబంధించి ప్రభుత్వం చెల్లించిన సొమ్ముని తిరిగి ఇవ్వాలని హైకోర్టు అదేశించింది. ఈ అంశం పై తెలంగాణ ప్రభుత్వం 2022 లో సుప్రీం కోర్టుకి అప్పిల్ కి వెళ్లింది. ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటికి వాదనలు వినిపించలేదు. ఈనెల 3 వ తేదిన విచారణకు వచ్చింది. పిటిషనర్ ఇంకా సమయం కావాలని కోరడంతో 2 వారాల కంటే ఎక్కువ ఇవ్వలేమని తెల్చి చెప్పింది. ఇలా అధికారుల పై ప్రభుత్వాలు ప్రజల సొమ్మును ఖర్చు చేయడం పై ఫైట్ చేసినా ఫలితం మాత్రం అలస్యమే అవుతుంది.
రజత్
కుమార్ పై లగ్జరీ పెళ్లీ అరోపణ.
ఐఏఏస్ రజత్ కుమార్ పై అనేక అవినీతి అరోపణలు వచ్చాయి. ఎన్నికల సమయంలో మేలు చేసినందుకు 30 ఎకరాలు ఇచ్చారని వార్తల పై సీసీఎస్ లో ఆయన పిర్యాదు చేశారు. తన కూతురు పెళ్లికి మెఘా కంపనీ నుంచి డబ్బులు వెళ్లాయనే అవినీతి మరకల పై ఢిల్లీ హైకోర్టులో కేసు విచారణ జరుగుతుంది. ఆయన రిటైర్మెంట్ నవంబర్ 30న ఉంది. కేసు విచారణ మాత్రం 12-12-2023న విచారణకు రావడంతో బ్యూరోక్రాట్స్ పై విచారణ అలస్యం అనేది అనావాయితీగా వస్తుందని విమర్శలు వస్తున్నాయి. డీవోపీటీకి చేరిన పిర్యాదుల పై విచారణ పేపట్టనుంది. రజత్ కుమార్ పై ఇప్పటి వరకు 83 కోర్టు దిక్కరణ కేసులు నమోదయ్యాయి. ఇందులో చాలా వరకు క్షమాపణ కోరడంతో రద్దు చేశారని తెలుస్తుంది.
ఎంతో మంది ఐఏఏస్ లు , ఐపీఎస్ లు వారి విధులను సరిగ్గా నిర్వర్తించకుండా వందల కోట్ల స్కాంలను ప్రొత్సహించేలా వ్యవహారిస్తున్నారు. వారందరి పై ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ .కామ్ ఇన్వేస్టిగేషన్ కథనాలు ఇవ్వబోతుంది. ప్రజలకు సేవా చేసే అధికారులను గుర్తించి వారి సేవలను గుర్తించేలా స్టోరీలు ఉంటాయి.