Posted by admin on 2023-11-20 04:15:57 | Last Updated by admin on 2025-07-03 18:41:46
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 700
By
Devender Reddy.
9848070809
ఐఏఏస్, ఐపీఎస్ లు దేశంలో తామెక్కడైన పని చేస్తామని రూల్
5(1) ఐఏఏస్ క్యాడర్ రూల్స్ 1954 ప్రకారం ఒప్పందం పత్రం ఇస్తారు. కాని తెలంగాణలో పనిచేసే
అధికారులు ఏపీకి వెళ్లాలంటే ససేమీరా అంటున్నారు. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ హైకోర్టు
తీర్పుతో అలా వెళ్లి జాయినింగ్ అయి ముందస్తు రాజీనామా చేశారు. వెంటనే మళ్లీ తెలంగాణకు
సలహాదారుడి రూపంలో వచ్చారు. ఇదే బాటలో క్యాట్ తీర్పును అడ్డుపెట్టుకుని 2015 నుంచి
కోర్టులో కొనసాగుతునే ఉంది. కేంధ్ర ప్రభుత్వం
మీరు వెళ్లాల్సిందేనని క్యాట్ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 376 మంది ఐఏఏస్, 258 మంది
ఐపీఎస్, 149 మంది ఐఎఫ్ఎస్ అధికారులను ప్రత్యూష్ సిహ్హా కమిటీ పంపకాలు చేసింది.
ఇవాళనే ఫైనల్ హియరింగ్ – ఈ అధికారులకే టెన్షన్.
జస్టిస్ అభినంద్ కుమార్ శావిలీ, జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి బెంచ్ ఫైనల్ హియరింగ్ కు గాను లిస్ట్ లో ఐటం నెంబర్ 89, 90 గా ఉంది. దీంతో ఐఏఏస్ లు హరికిరణ్, మల్లెల ప్రశాంతి, వాకాటి కరుణ, శివశంకర్ లోహితి, గుమ్మల శ్రీజనా, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోజ్, వాణి ప్రసాద్, డిప్యూటేషన్ పై సెంట్రల్ లో పని చేస్తున్న అమరాపాలి. ఇక ఐపీఎస్ ల్లో రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్, అభిలాష్ బిస్టా ఉన్నారు. అభిషేక్ మహాంతి ఏపీ నుంచి తెలంగాణకు వచ్చేలా పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ముందుగా తెలంగాణ ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వాలని గతంలో హైకోర్టు డివిజన్ బెంచ్ అదేశించింది. చాలా కాలం పాటు పోస్టింగ్ ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అదేశాల మేరకు కరీంనగర్ సీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐఎఎస్ ఎస్ ఎస్ రావత్ , అనంతరామ్ లను క్యాట్ తెలంగాణకు వెళ్లాలని తీర్పు నిచ్చింది. కాని వారిద్దరు ఏపీలోనే ఉన్నారు.
తీర్పు ఎప్పుడు ఉండబోతుందో..
ఫైనల్ వాదనల తర్వాత తీర్పు ఎన్నికల
లోపు ఉండబోతుందా.. ఎన్నికలకు సిద్దం చేసుకున్న అధికారులు మరింత సమయం కోరే అవకాశం ఉందా..?
ఎన్నికల కమిషన్ హైకోర్టుకు ఏలాంటి వాదనలు వినిపిస్తుందో ఆసక్తిగా మారనుంది. తీర్పుకు
అనుకూలంగా కేంద్రం రిలీవింగ్ చేస్తే.. ఎన్నికల ముందు అధికారుల్లో భారీ కుదింపు ఉండబోతుంది.
ఎలక్షన్ తర్వాత తీర్పు ప్రకటిస్తే ఆ తర్వాత కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి
ఉంటుంది. క్యాట్ తీర్పును సవాల్ చేసిన కేంద్ర ప్రభుత్వం వీరికి మళ్లీ అప్పిల్ కు వెళ్లేందుకు
అవకాశం లేకుండానే సోమేష్ కుమార్ ఆర్డర్ లానే వెంటనే రిలీవింగ్ ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలు
ఉన్నాయి.