Caste wise seats and Votes in Telangana

NEWS ANGLE for all parties

Posted by admin on 2023-11-18 05:10:07 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 392


Caste wise seats and Votes in Telangana

  • ఎన్నికల్లో మీ కులం వారికి ఇచ్చిన సీట్లు ఎన్ని
  • ప్రభుత్వం వస్తే సేవలు ఎలా ఉపయోగించుకుంటారు.
  • రాజకీయంగా ఎదిగేందుకు భుజాలు కాయలు కాసేలా జెండా మోస్తుంది ఎవ్వరు. 
  • ఉనికిని చాటుకునేలా అప్పర్ క్యాస్ట్ కే అవకాశాలు ఎందుకు వస్తుంటాయి. 
  • ఎన్నికల్లో కులంతో ముడిపెట్టే నేతలు ఎందుకు సక్సెస్ కావడం లేదు. 
  • పార్టీల కులాల సీట్ల పై ప్రత్యేక కథనం.   ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ బ్యూరో. (9848070809)

అర్ధికంగా, సామాజికంగా అణగారిన వర్గాలకు రిజర్వేషన్స్ కొనసాగున్నాయి. పార్టీలు గెలిచే సామాజిక వర్గాలకు టికెట్లు ఇస్తున్నాయి. ఓట్ల కోసం అన్ని పార్టీలు మాటలు చెప్పుతున్నా.. ఆయా పార్టీలు ఏ కులాలకు ఎన్ని సీట్లు ఇచ్చాయో ప్రత్యేక కథనం.


రెడ్డిలకు రెచ్చిపోయేలా సీట్లు.

తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న రెడ్డి కమ్యూనిటీ బలంగా కనిపిస్తుంది. వారి ప్రభవం అలానే ఉంటుంది. అందుకు ప్రతి పార్టీ ఎక్కువ సీట్లు కేటాయించింది. బీజేపీ 30, బీఆర్ఎస్, 43, కాంగ్రెస్ 44 సీట్లను రెడ్డిలకు కేటాయించారు. ఈ కులం వారి  ఓట్లు 6.5 శాతం. 


వెలమలకు ఓట్లు తక్కువ సీట్లు ఎక్కువ .

తెలంగాణ వచ్చిన తర్వాత అత్యధిక పదవులు చేపట్టిన వెలమకు వారి ఓట్ల 1.5 శాతం. బీజేపీ 8, కాంగ్రెస్ 9, బీఆర్ఎస్ 10 సీట్లు ఇచ్చి తక్కువ ఓట్లు ఉన్నవారిలో ఎక్కువ సీట్లు సాధించిన వారిగా రికార్డ్ లో ఉన్నారు.


బీసీల్లో మున్నూరుకాపులకే ఎక్కువ .

బీసీల్లో రాజకీయంగా బలంగా ఉండే కులం మున్నురుకాపు. కాంగ్రెస్ 4, బిజేపీ 10, బీఆర్ఎస్ 10 మంది అభ్యర్దులకు బీఫామ్ ఇచ్చారు. 


యాదవ్స్ కి , గౌడ్స్ కి సరిసమానంగా పంచేశారు. 


ఆర్ధికంగా, జనాభాలో ఎక్కువ చెప్పుకోదగ్గ శాతం ఉన్న యాదవ్, గౌడ్స్ కి అన్ని పార్టీలు ఇరు కులాలకు సమానంగా పంచారు. యాదవ్స్ కి  బీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 4,బీజేపీ 6 సీట్లు ఇవ్వగా, గౌడ్స్ కి బీఆర్ఎస్ 5,కాంగ్రెస్ 4, బీజేపీ 7 సీట్లు కేటాయించారు. 


పద్మశాలి వారికి మళ్లీ పంగనామాలే పెట్టారు. 

బీసీ ఓటర్లలో అన్ని కులాలతో ముందు ఉండే పద్మశాలీలకు ఎప్పుడు అన్యాయమే జరుగుతుంది. కాంగ్రెస్ 2 సీట్లు, బీజేపీ, బీఆర్ఎస్ తలా ఒక్క (1)సీటుని కేటాయించారు. 


ముదిరాజులను నట్టెంట ముంచేశారు

బీసీలో అత్యంత ఎక్కువ ఓటర్లు ఉన్న కులం ముదిరాజ్.  రాజకీయంగా ఎదిగేందుకు ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా ఎక్కడిక్కడ ముంచేస్తున్నారు. ఈటల రాజేందర్ మాత్రమే మా లీడర్ అని చెప్పుకోదగ్గ పేరు వినిపిస్తుంది. బీఆర్ఎస్ 1 సీట్ ఇవ్వగా, కాంగ్రెస్ 4 సీట్లు ఇచ్చింది. బిజేపీ 7గురుకి బీఫామ్ ఇప్పించడంలో ఈటల గట్టిగా ప్రయత్నం చేశారని ఆ కులం పెద్దలు చర్చించుకుంటున్నారు. 


సెటిలర్స్ ఓట్ల కోసం కమ్మలను కమ్మేశారట.

సెటిలర్స్ ఓట్ల కోసం , ఎలాంటి విషయాలనైనా తమదైన శైలీలో ప్రచారం చేసుకునే కమ్మ కులానికి బీజేపీ, 3, కాంగ్రెస్ 3 , బీఆర్ఎస్ 5 టికెట్లు ఇచ్చింది. 


బ్రహ్మణులకు మొత్తంగా 6.

అడ్మినిస్ట్రేషన్ లో పట్టున్న బ్రహ్మణులకు రాజకీయంగా అంతంతే అని చెప్పవచ్చు. బీఆర్ఎస్ 1,బిజేపీ 2, కాంగ్రెస్ మూడు సీట్లు కేటాయించారు. 


వైశ్యులకు టికెట్ ఇవ్వని కాంగ్రెస్.

ఊళ్లో ప్రతి కుటుంబానికి బిజినెస్ సంబందాలతో ముడిపడి ఉన్న అత్యంత తక్కువగా ఉండే ఓటర్లైన వైశ్యులకు  బీజేపీ 2, బీఆర్ఎస్ 1, ఇవ్వగా కాంగ్రెస్ మాత్రం ఇవ్వాలని ప్రయత్నం చేసినా ఇవ్వలేకపోయామని చెప్పుకోచ్చారు. 


రిజర్వేషన్స్ కోటాకే ఎస్సీ లీడర్స్ పరిమితం చేశారు. 

మాలలకే ఎక్కువ సీట్లు. 

దళిత బిడ్డలను రాజకీయంగా ఎదిగేలా ఎన్నో చట్టాలు తీసుకోచ్చారు. రిజర్వేషన్ ద్వారా ప్రొత్సహిస్తున్నారు. అయితే వారిని జనరల్ సీట్ లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. అందులో తక్కువ ఓట్లు ఉన్న వారికే  సీట్లు ఎక్కువగా కేటాయించారు. మాలలకు కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 11, బీజేపీ 12 సీట్లు కేటాయించింది. 

మాదిగలకు రెండు అంకెలు దాటలేదు. 

జనాభాలో ఎంతో కీలకంగా ఉండే మాదిగలకు ఏ పార్టీ రెండు అంకెలు కేటాయించలేదు. బీఆర్ఎస్ 9, బీజేపీ 9, కాంగ్రెస్ 8 సీట్లను కేటాయించారు. వారి వారి స్థానాలు కాకుండా జనరల్ సీట్లలో  బీజేపీ రెండు సీట్లు, బీఆర్ఎస్ 1 సీటుని మాత్రమే జనరల్ లో బీఫామ్ ఇచ్చారు. కాంగ్రెస్ అక్కడికే కట్టడి చేసింది.


రిజర్వేషన్ సిట్లకే పరిమితం అయినా ఎస్టీ నేతలు. 

 12 ఎస్టీ రిజర్వేషన్  లంబాడీలకు అగ్రతాంబులం. 

లంబాడీ కులస్తులకు బీజేపీ 8, బీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 6 మందిని బరిలోకి దింపారు. 10 శాతం రిజర్వేషన్ అంటూ బీఆర్ఎస్ చెప్పుకొచ్చినా వారి రిజర్వేషన్ సీట్లలోనే బీఆర్ఎస్ పరిమితం చేసింది. ఇతర ఎస్టీ కులాలకు బీఆర్ఎస్ 5, కాంగ్రెస్ 6, బీజేపీ 4 సీట్లు ఇచ్చింది. అంటే ఏ ఒక్కపార్టీ కూడా జనరల్ లో పోటీకి దింపలేదు. 


నార్త్ ఇండియన్స్ కి సీట్లు ఇచ్చారు. 

బీజేపీ 2, బీఆర్ఎస్ 1 సీటు ఇచ్చింది. కాంగ్రెస్ మాత్రం ఆ వలస నేతలకు ఛాన్స్ ఇవ్వలేదు.


ముస్లీంలకు ప్రియార్టీ ఉంది. 

బీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 6 సీట్లు కేటాయించగా.. బిజేపీ మాత్రం ఏ ఒక్క ముస్లింకి అవకాశం కల్పించలేదు. 


రాజకీయంగా ఎదిగేలా ప్రయత్నం చేస్తున్నబీసీ, ఎస్సీ,ఎస్టీ లీడర్లు అంతా స్థానిక ఎన్నికల వరకే పరిమితం అవుతున్నారని అరోపణలు ఉన్నాయి. చట్ట సభలో అడుగుపెట్టాలనే ఆశలు మాత్రం ఇంకా నేరవేరడం లేదు. ఓట్ల రాజకీయం కోసం మాత్రమే పార్టీలు పని చేస్తాయని చెప్పడానికి ఈ కులాలకు కేటాయించిన సీట్లను చూసి చెప్పవచ్చు. 

Leave a Comment: