KCR Plan - Target 60. only 6 Ministers will win.

Telangna War 2023

Posted by admin on 2023-11-17 03:56:43 |

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 1126


KCR Plan - Target 60. only 6 Ministers will win.

60 సీట్లు  గెలిచేలా అధికార పార్టీ ప్లానింగ్.

17 మంది క్యాబినేట్ లో 6 గురు మంత్రులకే ఛాన్స్. 

గతంలో ఎప్పుడు లేనంత టెన్షన్ లో గులాబీ నేతలు

ప్లాన్ -బి లో భాగంగా  దృషుప్రచారానికి శ్రీకారం. 

సోషల్ మీడియా కౌంటర్స్ , అవగాహానాలతో కంగారు పడుతున్న కారు. 

సర్వే సంస్థలు అన్ని సోషల్ మీడియా వ్యూవర్స్ తోనే రిపోర్ట్స్. 

ఆగమాగం కావద్దని కీలకనేతలకు కేసీఆర్ హితవు. 

గెలిచే ఆ ఆరుగురు మంత్రులు వీళ్లే..

ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ ఎక్స్లూజివ్ రిపోర్ట్.


By 

Devender Reddy

9848070809.

తెలంగాణలో వార్ వన్ సైడ్ అయ్యేలా కనిపించడం లేదు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎన్నడు లేని విధంగా మౌత్ టాక్ తో దృష్ప్రాచారాలు మొదలు పెట్టుకుంటున్నారు. నిజం గడపదాటే లోపే అబద్దం అంతా చుట్టేసి వస్తుంది. ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ వైపే తెలంగాణ ప్రజలు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు చెప్పుతున్నారు. దీంతో  రాజకీయ కురు వృద్దులు కేసీఆర్ ప్లాన్ -బీ అమలు చేస్తున్నారు. వీలైనంత ఎక్కువగా ఫర్సనల్ గా టార్గెట్ చేసేందుకు క్యాడర్ ని సిద్దం చేస్తున్నారు. అవసరమైతే ఫర్సనాల్టిని కూడా వదలడం లేదు. ప్రతిపక్షాలకు అప్పు కూడా పుట్టనివ్వకుండా చేస్తున్నారు. ఫైనాన్సర్స్ కి  కేసీఆర్ కుటుంబ సభ్యులు నేరుగా ఫోన్స్ చేయడంతో భయపడుతున్నారు. 


టార్గెట్ 60 అందులో 6 గురు మంత్రులే. 


ఎవ్వరి లెక్కలు వారి ఉన్నా.. 10 ఏండ్ల కేసీఆర్ కుటుంబ పాలన పై ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుంది. ఏడాదిన్నర క్రితం నుంచి ప్రవేశపెట్టిన పథకాలే కేసీఆర్ పై వ్యతిరేకను పెంచాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది తమ గ్రాఫ్ ని మళ్లీ పెంచుకునేలా కేసీఆర్ ప్రయత్నం చేశారు. కాని ఆ ప్రసంగాల్లో పసలేకపోవడం. సోషల్ మీడియాలో  కేసీఆర్ మాటలు బోరుకొట్టించి ప్రసంగాన్ని పట్టించుకోకపోవడంతో  ప్లాన్ -బి లో భాగంగా మౌత్ టాక్ కే ప్రాముఖ్యత ఇస్తున్నారు. తమ క్యాడర్ అంతా ప్రత్యర్ధుల పై ఫర్సనల్ టాక్స్ మొదలు పెట్టారు. గెలిచే 60 సీట్ల పై ఫోకస్ పెట్టాలని , ఆర్ధికంగా మరింత సహాయసహాకారాలు అందించాలని అదేశించినట్లు సమాచారం. అయితే అందులో 6గురు మంత్రులే గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, తలసాని, మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి లు మాత్రమే పక్క గెలుస్తున్నారని చెప్పుతున్నారు. 


కష్టాల్లో మంత్రులు.

ముఖ్యమంత్రితో పాటు 17 మంది కేబినేట్ మినిస్టర్స్ ఉన్నారు. ఇందులో ముగ్గురు ఎమ్మెల్సీలు కాగా 6 గురు ఎమ్మెల్యేలు గెలుస్తారని అనుకుంటున్నారు. అయితే గెలుపు నల్లెరుమీద నడకే అనుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు కి కూడా కష్టమే. శ్రీనివాస్ గౌడ్ పై లోకల్ లో పట్టు ఉందని చెప్పుకుంటున్నా.. తమ్ముడి రౌడీయిజంతో పాటు సైలెంట్ ఓటింగ్ దెబ్బ తినే అవకాశాలు ఉన్నాయి. కరీంనగర్ నుంచి గంగుల గట్టెక్కడం కష్టమే అంటున్నారు. కొప్పుల ఈశ్వర్ ఓటమి ఖచ్చితమే. అదిలాబాద్ ఇంద్రకరణ్ రెడ్డి ఇంద్రజాలలు పారడం లేదట. జగదీశ్వర్ రెడ్డి మళ్లీ గెలిచే అవకాశాలే లేవని రిపోర్టులు చెప్పుతున్నాయి. సబితాను ఐటీ దాడులతో కంట్రోల్ చేశారు త్రీముఖ పోటీలో మూడో స్థానంలోకి వెళ్లిన అశ్చర్యం లేదని మహేశ్వరం ప్రజలు మంత్రి మహిమలు పారడం కష్టమే అంటున్నారు. పువ్వాడ పై తుమ్మల పైచేయి సాధించే అవకాశాలు ఉన్నాయి. ప్రశాంత్ రెడ్డి ఓటమికి కుటుంబ రాజకీయాలే కారణం అవుతున్నాయి. దీంతో 17 మంది మంత్రుల్లో  6గురే గెలుపు గుర్రాలుగా గుర్తించారు. మిగితా వారి గెలుపుకు వారే బాధ్యులు అంటూ.. టార్గెట్ 60 నుంచి వారిని పట్టించుకోవడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.  




Leave a Comment: