Posted by admin on 2024-12-09 17:24:52 |
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 216
పలకలు వేయ్యి ప్రభుత్వ భూములు కబ్జా చేయి.
రంగారెడ్డి, సంగారెడ్డిలో నయా దందా..
చిన్న , చిన్న బిట్లుగా చేసి వందల ఎకరాలు స్వాహా.
ప్రభుత్వంలో ఉండే పెద్దలే సూత్రదారులు, పాత్రదారులంతా వేరే మతస్థులు.
తెలంగాణలో భారీగా భూ కుంభకోణాలు.
ప్రైవేట్ పరం కాని ప్రభుత్వ భూముల పై కన్ను.
వక్ఫ్, దేవాదాయా, కోర్టు కేసులున్న ప్రభుత్వ భూములే టార్గెట్.
ఔటర్ అవుతలా ప్రభుత్వ భూములు పంచుక తిందాం రండీ..
అంటున్న భూ మాఫియా పై
ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ స్పెషల్ స్టోరీ.
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల.
9848070809.
బీఆర్ఎస్ ప్రభుత్వం భూ దోపిడి మరవక ముందే కాంగ్రెస్ నేతల ధన దహాం భారీగా కనిపిస్తుంది. ప్రభుత్వ భూముల పై పడి దోచుకుంటున్నారనే అరోపణలు ఇటీవల కాలంలో తెరపైకి వస్తున్నాయి. ఫ్యూరీలీ ప్రభుత్వ భూములు అయినా, కోర్టుల్లో కేసులు ఉన్నా, చిన్న, చిన్న రూంలు వేసి కబ్జాలకు పాల్పడుతున్నారు. అందుకు రోడ్లు, కరెంట్, మున్సిపల్, గ్రామ పంచాయితీ పర్మిషన్స్ ఇట్లే వస్తున్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓ పెద్ద కాంట్రాక్టర్ కి అప్పగించి వాటాలు పంచుకునే వారు. కాంగ్రెస్ లో పేదల పేర్లు చెప్పి వందల ఎకరాలు కబ్జాలకు పాల్పడుతున్నారు. ప్రీ వాల్ కాస్ట్ వాల్ వేసుకుని, ఇతర రాష్ట్రాల నుంచి మనుషులను తెచ్చుకుని ప్రభుత్వ భూముల పై పట్టుసాధిస్తున్నారు. మసీదులు, దేవాలయాలు నిర్మిస్తే ఎవ్వరు రారు అంటూ వందల ఎకరాలు కబ్జాలకు పాల్పడుతున్నారు. ఇలా ఔటర్ చుట్టు ఉన్న భూముల పైనే కాంగ్రెస్ నేతలు కబ్జా చేయడం కలవర పెడుతుంది. వందల ఎకరాలను టార్గెట్ చేయడంతో ఇక ప్రభుత్వ భూములైన, వక్ఫ్ , దేవాదాయా, సిలింగ్ , భూములు ప్రభుత్వానికి దక్కెలా కనిపించడం లేదు.
ఇలానే వదిలేస్తే.. రేపటి తరానికి భూములు ఉండవు.
ReplyForward |